Flash News: బిపిన్ రావత్ కన్నుమూత
Flash News: దేశ రక్షణ వ్యవస్థలో కీలక పాత్ర పోషించిన పోరాట యోధుడు నిష్క్రమించారు. తమిళనాడు హెలికాప్టర్ కుప్పకూలిన ఘటనలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్ దుర్మరణం పాలయ్యారు. 63 ఏళ్ల బిపిన్ రావత్ తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో పోరాడుతూ కన్నుమూశారు. భారత రక్షణ, భద్రతా రంగాలలో కీలక సంస్కరణలకు కారణభూతుడైన రావత్ ఇంత అర్ధాంతరంగా కన్నుమూయడం యావద్దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది.