Manipur extends lockdown: లాక్ డౌన్ పొడిగించిన మణిపూర్!

Manipur extends lockdown: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ ని అడ్డుకోవడానికి కేంద్ర. రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ సరైనా మార్గంగా ఎంచుకొని ముందుకు వెళ్తున్నాయి. ..

Update: 2020-06-28 16:16 GMT
Manipur chief minister biren singh announcing extension of lock down (image courtesy: ANI)

Manipur extends lockdown: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ ని అడ్డుకోవడానికి కేంద్ర. రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ సరైనా మార్గంగా ఎంచుకొని ముందుకు వెళ్తున్నాయి. అయినప్పటికీ కరోనా తీవ్రత మాత్రం ఎక్కడ కూడా తగ్గడం లేదు.. కొన్ని రాష్ట్రాలలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. అయితే రికవరీ రేటు కూడా అంతే స్థాయిలో ఉండడం కొంచం ఉరట కలిగించే అంశంగా చెప్పుకోవచ్చు.

ఇక కరోనా తీవ్రతను మరింతగా అడ్డుకోవడం కోసం మణిపూర్ రాష్ట్రం జూలై 15వరకు లాక్‌డౌన్‌ పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. ఈ విషయాన్నీ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బిరెన్‌సింగ్‌ స్వయంగా వెల్లడించారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపధ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా అయన వెల్లడించారు. ప్రస్తుతం ఆ రాష్ట్రంలో ఇప్పటి వరకు 1092 కరోనా కేసులు నమోదు కాగా, ఇందులో 660 యాక్టివ్‌ కేసులుండగా 432మంది చికిత్సకు కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఇక ఇప్పటికే పచ్చిమ్ బెంగాల్, జార్ఖండ్ రాష్ట్రాలు జులై 31 వరకు లాక్ డౌన్ ని పోడిగించాయి. త్వరలో హైదరాబాద్ లో కూడా లాక్ డౌన్ ని పొడిగించే ఆలోచనలో తెలంగాణ ప్రభుత్వం ఉంది.

ఇక అటు దేశంలో కరోనా కేసుల విషయానికి వచ్చేసరికి దేశవ్యాప్తంగా కూడా కరోనా ఉధృతి పెరిగిపోతుంది. గడిచిన 24 గంటల్లో 19,906 కేసులు నమోదు అయ్యాయి. కరోనా మొదలు నుంచి ఈ స్థాయిలో కేసులు నమోదు అవ్వడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం.. ఇక తాజా కేసులతో కలిపి దేశంలో కేసుల సంఖ్య 5,28,859కి చేరింది. ఇక మరణాల సంఖ్య 16,095కు చేరుకున్నాయి. ఇక కరోనా నుంచి ఇప్పటి వరకూ 3,09713 మంది కోలుకోగా, రికవరీ రేటు 58.13 శాతంగా ఉంది. ప్రస్తుతం దేశంలో దాదాపు 2,03051 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు.  

Tags:    

Similar News