Coronavirus Updates in Andhra pradesh: ఏపీలో 13 వేలు దాటిన పాజిటివ్ కేసుల సంఖ్య.. ఇవాళ 12 మంది మృతి

Coronavirus Updates in Andhra pradesh: ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. ఇవాళ కొత్తగా 813 మందికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది.

Samba Siva Rao
Published on: 28 Jun 2020 2:32 PM IST
Coronavirus Updates in Andhra pradesh: ఏపీలో 13 వేలు దాటిన పాజిటివ్ కేసుల సంఖ్య.. ఇవాళ 12 మంది మృతి
X

Coronavirus Updates in Andhra pradesh: ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. ఇవాళ కొత్తగా 813 మందికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. వారిలో 50 మంది ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు కాగా.. మరో ఎనిమిది మంది విదేశాల నుంచి రాష్ట్రానికి వచ్చారు. ఓవరాల్ గా ఏపీలో కరోనా కేసుల సంఖ్య 13,098కి పెరిగింది. గడచిన 24 గంటల వ్యవధిలో 12 మంది మృత్యువాత పడ్డారు.

కర్నూలు జిల్లాలో ఆరుగురు, కృష్ణా జిల్లాలో ఐదుగురు, పశ్చిమ గోదావరి జిల్లాలో ఒకరు మరణించారు. దాంతో రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 169కి పెరిగింది. తాజాగా 401 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో మహారాష్ట్ర 10, తమిళనాడు 14, తెలంగాణ 18, ఢిల్లీ 3, మధ్యప్రదేశ్ 2, చత్తీస్‌గఢ్ 1, కర్ణాటక 1, ఒడిశా 1 ఉన్నాయి. విదేశాల నుంచి వచ్చినవారిలో కిర్గిస్థాన్, కజికిస్థాన్, మలేషియా కువైట్ 2, ఖతార్ 2, దక్షిణాఫ్రికా, ఒక్కొక్కటి ఉన్నాయి. ఇప్పటివరకు ఏపీలో కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 5,908 కాగా, మరో 7,021 మంది చికిత్స పొందుతున్నారు.




Samba Siva Rao

Samba Siva Rao

Next Story