Viral Video: మహిళకు బలవంతంగా ముద్దుపెట్టిన పోకిరి.. ఒక్కసారిగా షాకైన మహిళ..!
Viral Video: బీహార్‌లో ఓ యువకుడు నడిరోడ్డుపై ఆసుపత్రి ముందు నిల్చున్న ఓ మహిళను గట్టిగా పట్టుకొని బలవంతంగా ముద్దు పెట్టుకున్నాడు.
Viral Video: మహిళకు బలవంతంగా ముద్దుపెట్టిన పోకిరి.. ఒక్కసారిగా షాకైన మహిళ..!
Viral Video: బీహార్‌లో ఓ యువకుడు నడిరోడ్డుపై ఆసుపత్రి ముందు నిల్చున్న ఓ మహిళను గట్టిగా పట్టుకొని బలవంతంగా ముద్దు పెట్టుకున్నాడు. దీంతో ఆ మహిళ షాక్ కి గురైంది. ఏం జరిగిందో తెలుసుకునేలోపే ఆ వ్యక్తి అక్కడి నుంచి పారిపోయాడు. ఇదంతా సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యింది. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
బాధితురాలు జమై సర్దార్ ఆసుపత్రిలో పని చేస్తుంది. ఆసుపత్రి బయట నిల్చుని ఫోన్ లో మాట్లాడుతుండగా.. వెనక నుంచి వచ్చిన వ్యక్తి బలవంతంగా ముద్దు పెట్టడంతో షాక్ కి గురైంది. ఆ దుండగుడి నుంచి విడిపించుకునేందుకు ఆమె గట్టిగానే ప్రయత్నం చేసింది. కానీ, ఆమె కదలకుండా అతడు గట్టిగా బిగించాడు. కాగా, గుర్తు తెలియని వ్యక్తి ఆసుపత్రి గోడ దూకి మహిళ దగ్గరికి వచ్చాడు. ఇక, బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్టు స్థానిక పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు.