మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం : 3 నెలలపాటు అద్దె వసూలు వాయిదా
కరోనా వైరస్ కట్టడికి కేంద్రం లాక్ డౌన్ విధిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.. దీనివలన బయటకు రాని పరిస్థితి ఏర్పడింది.
కరోనా వైరస్ కట్టడికి కేంద్రం లాక్ డౌన్ విధిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.. దీనివలన బయటకు రాని పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో పనులు లేక చిరుద్యోగులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. వలసకూలీలు తిండిలేక ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపధ్యంలో మహారాష్ట్ర సర్కార్ ఓ స్ఫూర్తి మంతమైన నిర్ణయంతో ముందుకొచ్చింది.
మూడు నెలలవరకు ఇంటి అద్దె వసూలు చేయకూడదని ఆదేశాలు జారీ చేసింది.ఎవరైనా అద్దె కోసం ఇబ్బంది పెట్టడం కానీ, ఇళ్లు ఖాళీ చేయించకూడదని సూచించింది. ఎవరైనా ఈ ఆదేశాలను పాటించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
ఇక కరోనా కేసులు మహారాష్ట్రలో రోజురోజుకి పెరుగుతున్నాయి. అక్కడ ఇప్పటివరకు మూడువేలకుపైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో నమోదైన కేసుల్లో రెండువేలకుపైగా ముంబైలోనే నమోదవడం గమనార్హం. ఇక దేశవ్యాప్తంగా చూసుకుంటే కరోనా కేసుల సంఖ్య 13 వేలకి పైగా చేరింది. 450 పైగా మరణించారు.