వామపక్ష కోటలో బీజేపీ తొలి విజయం
వామపక్షాల కోటలో బీజేపీ తొలి విజయం కేతనం ఎగురవేసింది. కేరళలోని తిరువనంతపురం మున్సిపల్ కార్పొరేషన్‌లో బీజేపీ చారిత్రాత్మక విజయం సాధించింది.
తిరువనంతపురం: వామపక్షాల కోటలో బీజేపీ తొలి విజయం కేతనం ఎగురవేసింది. కేరళలోని తిరువనంతపురం మున్సిపల్ కార్పొరేషన్‌లో బీజేపీ చారిత్రాత్మక విజయం సాధించింది. లెఫ్ట్ డెమొక్రటిక్ ఫ్రంట్ (ఎల్‌డీఎఫ్) 45 సంవత్సరాలుగా పాలించిన ఈ కార్పొరేషన్ లోని 101 సీట్లలో ఈసారి బీజేపీ-ఎన్‌డీఏ కూటమి 50 స్థానాలను గెలుచుకుంది. ఎల్‌డీఎఫ్ 45 సంవత్సరాల పట్టును బద్దలు కొట్టింది.
కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ ప్రాతినిధ్యం వహిస్తున్న తిరువనంతపురం పార్లమెంటు స్థానంలోనే ఈ కార్పొరేషన్ పరిధి ఉంది. అలాంటి చోట బీజేపీ భారీ విజయం నమోదు చేయడం విశేషం. అధికార కూటమి ఎల్‌డీఎఫ్ కు ఈ ఎన్నికల్లో ప్రజలు భారీ ఓటమిని చవిచూపించారు. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బీజేపీ విజయం ఆ పార్టీలో మరింత జోష్ పెంచింది. ఎన్డీయే కూటమి ఊహించని విధంగా 50 వార్డుల్లో విజయం సాధించడంతో కూటమి నేతలు సంబరాలు చేసుకుంటున్నారు. గత పార్లమెంటు ఎన్నికల్లో ఒక సీటును, దాదాపు ఐదేళ్ల కిందట జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే ఒక స్థానాన్ని మాత్రమే బీజేపీ కైవసం చేసుకుంది. అలాంటి పరిస్థితి నుంచి తిరువనంతపురం కార్పొరేషన్‌లో పాగా వేసే వరకు చేరుకు చేరుకుంది. ఈ ఎన్నికల్లో ఎన్డీఏ 50 వార్డులను, ఎల్‌డీఎఫ్ 29, యూడీఎఫ్ 19 వార్డులు గెలుచుకున్నాయి. మరో రెండు చోట్ల స్వతంత్రులు విజయం సాధించారు. ఎర్నాకుళం కార్పొరేషన్‌ను కూడా ఎన్డీయే కైవసం చేసుకుంది.
స్థానిక ఎన్నికల్లో ‘యూడీఎఫ్’ స్వీప్
కేరళ స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ కూటమి మెజారిటీ బ్లాక్ పంచాయతీలను గెలుచుకుంది. అధికార ఎల్‌డీఎఫ్ కూటమి రెండో స్థానంలో నిలిచింది. ఎన్డీయే తన సత్తా చాటుతోంది.