ఫ్రీ గ్యాస్ కనెక్షన్ పొందడానికి ఇలా దరఖాస్తు చేయండి
ప్రతి ఇంట్లో వంటగ్యాస్ అనేది నిత్యావసర వస్తువుగా మారింది. వంటగ్యాస్ లేకుండా వంటగది పనులు ముందుకు సాగవు.
How to Apply for Free Gas Connection under PM Ujjwala Yojana
ప్రతి ఇంట్లో వంటగ్యాస్ అనేది నిత్యావసర వస్తువుగా మారింది. వంటగ్యాస్ లేకుండా వంటగది పనులు ముందుకు సాగవు. ధరలు పెరిగిన కారణంగా, పేద ప్రజలకు తక్కువ ధరకే వంటగ్యాస్ అందించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి ఉజ్వల యోజనను అమలు చేస్తోంది.
ఈ పథకం 2016 మే 1న ప్రారంభించబడింది. దీని ద్వారా పేద కుటుంబాలకు ఉచిత గ్యాస్ కనెక్షన్ మరియు రూ.550 మాత్రమే ఖర్చు చేసి గ్యాస్ సిలిండర్లు అందించబడతాయి. ఒక్కసారిగా ఏడాదికి 12 సిలిండర్ల వరకు సబ్సిడీతో పొందవచ్చు. ఇప్పటికే దేశవ్యాప్తంగా 12 కోట్లకు పైగా ప్రజలు ఈ లబ్ధి పొందుతున్నారు.
అర్హత షరతులు:
మహిళలు మాత్రమే దరఖాస్తు చేసుకోవచ్చు
భారత పౌరురాలు కావాలి
వయస్సు 18 సంవత్సరాల కంటే ఎక్కువ ఉండాలి
బీపీఎల్ (BPL) కుటుంబ సభ్యురాలు కావాలి
పీఎం ఆవాస్ యోజన గ్రామీణ్ లేదా అంత్యోదయ అన్న యోజన లబ్ధిదారులు కావాలి
షెడ్యూల్డ్ కులాలు/తెగలకు చెందినవారై ఉండాలి
ఆధార్ కార్డు, రేషన్ కార్డు, కుల ధృవీకరణ, రెసిడెన్షియల్ సర్టిఫికేట్ ఉండాలి
పాస్‌పోర్ట్ సైజ్ ఫొటో సమర్పించాలి
దరఖాస్తు విధానం:
ఉజ్వల యోజన వెబ్‌సైట్‌లో లాగిన్ అవ్వండి
“ఉజ్వల యోజన 2.0 కనెక్షన్” ట్యాబ్ క్లిక్ చేయండి
మీకు కావాల్సిన గ్యాస్ ఏజెన్సీని ఎంచుకోండి
పేరు, మొబైల్, ఈమెయిల్ వివరాలతో రిజిస్ట్రేషన్ పూర్తి చేయండి
రిజిస్ట్రేషన్ తర్వాత లాగిన్ అయి రాష్ట్రం, జిల్లా, పిన్ కోడ్, ఏజెన్సీ పేరును ఎంచుకోండి
KYC పూర్తి చేయండి (రేషన్ కార్డు, కుటుంబ సభ్యుల వివరాలు, బ్యాంక్ అకౌంట్ వివరాలు సమర్పించాలి)
అప్లికేషన్ ప్రింట్ తీసుకుని మీరు ఎంచుకున్న గ్యాస్ ఏజెన్సీని సమర్పించండి
ఈ ప్రక్రియ పూర్తి అయిన తర్వాత, గ్యాస్ సిలిండర్ మీకు కేటాయించబడుతుంది.