CM Shivraj Singh Chouhan to Donate Plasma: ప్లాస్మా దానం చేస్తా: సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్

CM Shivraj Singh Chouhan to Donate Plasma: కరోనా మ‌హ‌మ్మారిని జయించిన మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తాను కూడా ప్లాస్మాదానం చేస్తానని ప్రకటించారు.

Update: 2020-08-10 03:49 GMT
cm shivraj plasma donation

MP CM Shivraj Singh Chouhan to Donate Plasma: కరోనా మ‌హ‌మ్మారిని జయించిన మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తాను కూడా  ప్లాస్మాదానం చేస్తానని ప్రకటించారు. కోవిడ్ నివార‌ణ‌లో ప్లాస్మా ఎంతగానో ఉప‌యోగ ప‌డుతుందని, క‌రోనా బాధితుల కోసం ప్లాస్మా దానం చేస్తాన‌ని తెలిపారు.

సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ కు  గత నెల 25న క‌రోనా పాజిటివ్ రావ‌డంతో వెంట‌నే ఆసుపత్రిలో చేరారు. 11 రోజుల చికిత్స అనంతరం క‌రోనాను జయించి, ఆగస్టు 5వతేదీన డిశ్చార్జ్ అయ్యారు. సీఎం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాక హోం క్వారంటైన్ లో ఉన్నారు. ఆదివారం సీఎం రాష్ట్రంలో కరోనా పరిస్థితిపై వైద్యాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ లో సమీక్షించారు.'' నేను కరోనా నుంచి పూర్తిగా కోలుకొని ఆరోగ్యంగా ఉన్నాను. నా శరీరంలో యాంటీ బాడీలు కరోనాతో పోరాడాయి. నేను త్వరలో ప్లాస్మాను కరోనా రోగులకు దానమివ్వాలనుకుంటున్నాను'' అని సీఎం శివరాజ్ సింగ్ ట్వీట్ చేశారు. సీఎం శివరాజ్ సింగ్ కు మూడు రోజులుగా జ్వరం లేదని, కరోనా లక్షణాలు కూడా తగ్గాయని, దీంతో ఐసీఎంఆర్ నిబంధనల ప్రకారం తాము ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశామని చిరయూ వైద్యకళాశాల వైద్యులు చెప్పారు. 

Tags:    

Similar News