logo
ఆంధ్రప్రదేశ్

Rs.5,000 to Plasma Donors in AP: ప్లాస్మా దానం చేస్తే.. రూ. 5వేల సాయం : జ‌గ‌న్ స‌ర్కారు కీల‌క నిర్ణ‌యం

Rs.5,000 to Plasma Donors in AP:  ప్లాస్మా దానం చేస్తే.. రూ. 5వేల సాయం : జ‌గ‌న్ స‌ర్కారు కీల‌క నిర్ణ‌యం
X
cm jagan
Highlights

Rs.5,000 to Plasma Donors in AP: ఆంధ్రప్రదేశ్‌లో క‌రోనా రోజురోజుకూ విజృంభిస్తుంది. గ‌త వారం రోజులుగా పాజివిట్ కేసుల మ‌రింత పెరుగుతుంది. ఈ నేప‌థ్యంలో శుక్రవారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు ఆఫీస్‌లో క‌రోనా‌ కట్టడి, వైద్యం, విద్యావ్యవస్థ, నాడు-నేడు వంటి ప‌లు ఆంశాల‌పై సీఎం వైఎస్‌ జగన్‌ సమీక్ష నిర్వహించారు.

Rs.5,000 to Plasma Donors in AP: ఆంధ్రప్రదేశ్‌లో క‌రోనా రోజురోజుకూ విజృంభిస్తుంది. గ‌త వారం రోజులుగా పాజివిట్ కేసుల మ‌రింత పెరుగుతుంది. ఈ నేప‌థ్యంలో శుక్రవారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు ఆఫీస్‌లో క‌రోనా‌ కట్టడి, వైద్యం, విద్యావ్యవస్థ, నాడు-నేడు వంటి ప‌లు ఆంశాల‌పై సీఎం వైఎస్‌ జగన్‌ సమీక్ష నిర్వహించారు. ఈ సంద‌ర్బంగా ప‌లు నిర్ణ‌యాలు తీసుకున్నారు. కరోనా బాధితులను ఆదుకునేందుకు ముందుకు వ‌చ్చే ఫ్లాస్మా దాతల‌కు రూ.5000 ప్రోత్సాహక సాయం అంద‌జేయాల‌ని ఏపీ ప్రభుత్వం కీల‌క నిర్ణయించింది. కరోనా నివారణపై తీసుకోవాల్సిన చర్యలు, ప్లాస్మా థెరఫీ విస్తృతంగా అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. అత్యవసర మందులను అందుబాటులో ఉంచాలని, ఆస్పత్రుల్లో బెడ్స్‌ దొరకని పరిస్థితి ఉండరాదని సీఎం ఆదేశించారు.

బాధితుల వివరాలు, కరోనా బెడ్ల సమాచారం ఎప్ప‌టిక‌ప్పుడూ ఆస్పత్రి హెల్ప్‌ డెస్క్‌లో ఆప్‌లోడ్ చేయాల‌ని, ఎవ‌రికైనా బెడ్ అందుబాటులో లేక‌పోతే.. స‌మీప ఆస్ప‌త్రికి వెంటనే త‌ర‌లించాల‌ని ఆదేశించారు. జీజీహెచ్‌ లాంటి ఆస్పత్రులపై మరింత శ్రద్ధపెట్టాలని, ఆస్పత్రులపై ప‌ర్య‌వేక్ష‌ణ బాధ్య‌త‌ల‌ను జేసీలకు ఇవ్వాలని అన్నారు.

పాఠ‌శాలలు తెరిచే నాటికి ప్ర‌తి విద్యార్థికి విద్యాకానుకతో పాటు మాస్కులు కూడా అందించాలని అధికారులకు సూచించారు. కరోనాలాంటి విపత్తులను భవిష్యత్తులో ఎదుర్కోవాలంటే.. మూడేళ్ళలో మెడికల్ కాలేజీల నిర్మాణం పూర్తి చేయాలని అన్నారు. కురిచేడు మరణాలపై సమగ్ర విచారణ చేపట్టాలని సమీక్షా సమావేశంలో జగన్ పేర్కొన్నారు. లాక్‌డౌన్‌తో ఆటో, టాక్సీ డ్రైవర్ల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని రోడ్డు టాక్స్‌ చెల్లింపు గడువు పెంచుతున్న‌ట్టు తెలిపారు. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం ఆళ్లనాని, ప్రభుత్వ రోడ్డు ప్రధానకార్యదర్శి నీలం సాహ్ని, డీజీపీ గౌతమ్ సవాంగ్‌, హెల్త్‌ స్పెషల్‌ సీఎస్‌ జవహర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Web Titleandhra pradesh government will give rs 5 thousand to plasma donors
Next Story