First Plasma Donor To Donate For The Seventh Time : ఏడుసార్లు ప్లాస్మా దానం చేశాడు.. కానీ!

First Plasma Donor To Donate For The Seventh Time : ఏడుసార్లు ప్లాస్మా దానం చేశాడు.. కానీ!
x
Delhi's First Plasma Donor To Donate For The Seventh Time
Highlights

సోనూసూద్‌... ఎక్కడ విన్నా,చూసిన ఇతని పేరే వినిపిస్తుంది. కనబడుతుంది. మొన్నటివరకూ రీల్ లైఫ్‌లో విలనే కావచ్చు కానీ లాక్‌డౌన్ సమయంలో మాత్రం

First Plasma Donor To Donate For The Seventh Time : కరోనా మహమ్మారి యావత్ ప్రపంచాన్ని ఇప్పుడు వణికిస్తోంది.. ఇక భారత్ లో అయితే లాక్ డౌన్ సడలింపులు ఇచ్చిన తర్వాత అయితే రోజురోజుకు రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదు అవుతున్నాయి.. అయితే రికవరీ రేటు మెరుగ్గా ఉండడం కొంచం ఆశాజనకంగా కనిపిస్తుంది.. ఇక ఈ కరోనాకి వ్యాక్సిన్ ని కనిపెట్టే పనిలో నిమగ్నం అయి ఉన్నారు ప్రపంచ శాస్త్రవేత్తలు..

ఇక కొవిడ్ కి చికిత్స పొంది ఇంటికి వెళ్లిన పేషెంట్స్ తప్పనిసరిగా తమ ప్లాస్మాను ఇచ్చి సాటి మనుషుల్ని కాపాడాల్సిన బాధ్యత ఉందని చాలా మంది చెబుతున్నారు.. ప్లాస్మా డొనేషన్ కోసం ఎదురుచూస్తున్న చాలా మంది కరోనా బాధితులకు ఇది చాలా చక్కగా ఉపయోగపడుతుందని అంటున్నారు. ఇక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ప్లాస్మాను డొనేషన్ చేయాలని కోరుతున్నాయి.

అందులో భాగంగానే ఢిల్లీ ప్రభుత్వ ప్రకటన చూసి కరోనా నుంచి కోలుకున్న ఒక వ్యక్తి మొదటిసారి ప్లాస్మా డొనేట్‌ చేశాడు. ఏప్రిల్‌ నుంచి ఇప్పటి వరకూ మొత్తం ఏడుసార్లు దానం చేశాడు. అంతేకాకుండా ప్లాస్మాని డొనేట్‌ చేయాలనీ కోరుతున్నాడు. ఇక వివరాల్లోకి వెళ్తే ఢిల్లీలోని జహింగీర్‌పురికి చెందిన తబ్రేజ్‌ఖాన్‌(36) అనే వ్యక్తికి మార్చిలో కరోనా సోకింది. ఏప్రిల్ లో కోలుకున్నాడు.

అనంతరం ప్లాస్మా డొనేషన్ కోసం ఢిల్లీ ప్రభుత్వ ఇచ్చిన ప్రకటన చూసి వెంటనే వెళ్లి మొదటిసారి ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ లివర్‌ అండ్‌ బైలియరీ సైన్సెన్‌(ఐఎల్‌బీఎస్‌)లో ప్లాస్మా డొనేట్‌ చేసిన మొదటి వ్యక్తిగా నిలిచాడు. అలా ఇప్పటివరకు ఏడుసార్లు ప్లాస్మాని డొనేషన్ చేశాడు. ఇంకా ఎన్నిసార్లైనా ప్లాస్మా దానం చేయడానికి సిద్ధమని చెబుతున్నారు.

అయితే తనకి ఆవేదనకి కలిగించే విషయం ఏంటంటే.. కరోనా నుంచి కోలుకున్నాక చాలా వివక్షకు గురవుతున్నానని తబ్రేజ్‌ ఖాన్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ఇంతకుముందు తనను టీ తాగేందుకు పిలిచేవారు కూడా ఇప్పుడు తనను చూస్తేనే ముఖం చాటేస్తున్నారని వెల్లడించాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories