పిల్లలతో ఆడిపాడిన మధ్యప్రదేశ్ సీఎం
Shivraj Singh Chouhan: భోపాల్‌లో మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ దీపావళి సంబరాలు
Shivraj Singh Chouhan: పిల్లలతో ఆడిపాడిన మధ్యప్రదేశ్ సీఎం
Shivraj Singh Chouhan: మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ దంపతులు అనాదపిల్లలతో దీపావళి వేడుకలు జరుపుకున్నారు. భోపాల్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో శివరాజ్ సింగ్ చౌహాన్ దంపతులు పిల్లలతో కలిసి దీపావళి సంబరాల్లో పాలుపంచుకున్నారు. కోవిడ్ సమయంలో తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలతో దీపావళి సంబరాలను నిర్వహించారు. సంగీత కచేరి నిర్వహించి, ఆటపాటలతో ఎంజాయ్ చేశారు. ప్రత్యేక వంటకాలతో పిల్లలకు పండుగ విందునిచ్చారు. మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ఆడిపాడటంతోపాటు పిల్లలకు స్వయంగా విందు తినిపించి సంతృప్తి వ్యక్తంచేశారు. దీపావళి వేడుకల ఆద్యంతం మానవీతయను సంతరించుకున్నాయి.