Madhya Pradesh CM Shivraj Singh Chouhan: నా బట్టలు నేనే ఉతుక్కొంటున్నా

Madhya Pradesh CM Shivraj Singh Chouhan: దేశవ్యాప్తంగా కరోనా వైరస్ విలయ తాండవం చేస్తుంది.

Update: 2020-07-28 15:49 GMT
Washing My Own Clothes Says Chief Minister Shivraj Chouhan

Madhya Pradesh CM Shivraj Singh Chouhan: దేశవ్యాప్తంగా కరోనా వైరస్ విలయ తాండవం చేస్తుంది. వివిధ రాష్ట్రాల నుంచి వస్తున్న కేసులతో కలిపి రోజురోజుకు రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. ఇక కరోనా కూడా ఎవరిని వదలడం లేదు. సామాన్యుల నుంచి సెలబ్రేటిల వరకు ప్రతి ఒక్కరి పైన దీని ప్రభావం చూపిస్తూ ప్రజలను మరింతగా భయబ్రాంతులకి గురి చేస్తోంది. తాజాగా మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే.. దేశంలో కరోనా బారిన పడిన మొట్టమొదటి సీఎం కూడా ఆయనే కావడం విశేషం..

ప్రస్తుతం ఆయన క్వారంటైన్‌లో ఉంటూ చికిత్స తీసుకుంటున్నారు. భోపాల్‌లోని చిరాయు ఆస్పత్రిలో ఆయనకు చికిత్స జరుగుతున్నది. అయితే అయన అందుబాటులో లేకపోవడంతో క్యాబినెట్ మంత్రులకి అదనపు భాద్యతలను అప్పజెప్పారు. ఇక ఇది ఇలా ఉంటే తాజాగా అయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మీడియాతో మాట్లాడారు. అందులో భాగంగా అయన కొన్ని ఆసక్తికరమైన విషయాలను అయన వెల్లడించారు.

ప్రస్తుతం తన బట్టలను తానే ఉతుక్కుంటున్నట్లుగా అయన వెల్లడించారు. అయితే దీనివలన ఓ మేలు జరిగిందని అన్నారు అయన.. గతంలో తన చేతికి ఇటీవల ఆపరేషన్ జరిగిందని, ఎన్నోసార్లు ఫిజియోథెరపి చేయించినా.. పిడికిలి పట్టుకోవడం వచ్చేది కాదన్నారు. ప్రస్తుతం సులువుగా పనిచేస్తుందని అన్నారు. ఇక రెండవ సారి కూడా ఆయన శ్యాంపిల్‌లో కరోనా పరీక్షలో పాజిటివ్‌ గానే తేలింది. ఇక అటు మధ్యప్రదేశ్ లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటివరకూ అక్కడ 28,589 కరోనా కేసులు నమోదయ్యాయి. 820 మంది మరణించారు.  


Tags:    

Similar News