కొనసాగుతున్న హిజబ్ వివాదం.. హిజాబ్ కోసం ఉద్యోగాన్ని వదులుకున్న లెక్చరర్

Karnataka Hijab Row: కర్నాటకలో హిజబ్ వివాదం కొనసాగుతోంది. గత ఆరు రోజులుగా కర్నాటక హైకోర్టు దీనిపై విచారిస్తోంది.

Update: 2022-02-18 14:14 GMT

కొనసాగుతున్న హిజబ్ వివాదం.. హిజాబ్ కోసం ఉద్యోగాన్ని వదులుకున్న లెక్చరర్

Karnataka Hijab Row: కర్నాటకలో హిజబ్ వివాదం కొనసాగుతోంది. గత ఆరు రోజులుగా కర్నాటక హైకోర్టు దీనిపై విచారిస్తోంది. వాదనలు కొనసాగుతుండగానే ముస్లిం అమ్మాయిలు హిజబ్ ధరించడం తమ హక్కుగా గుర్తించాలంటూ నిరసనలు చేస్తున్నారు. హిజబ్ ధరించడాన్ని శబరిమల వివాదంలో సుప్రీంకోర్టు పేర్కొన్నట్టుగా రాజ్యాంగ పరిధిలో గుర్తించాలని కర్నాటక ఏజీ ప్రభులింగ కోర్టుకు సూచించారు.

మరోవైపు కాషాయ జెండాను జాతీయ జెండాగా చేస్తామన్న మంత్రి ఈశ్వరప్ప రాజీనామా చేయాలని ఆ రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్ డిమాండ్ చేశారు. ఇక తుంకూరులోని ఓ కాలేజీలో హిజబ్ ధరించి వచ్చిన లెక్చరర్ తనను యాజమాన్యం కాలేజీలోకి అనుమతించలేదంటూ రిజైన్ చేశారు. అయితే ఆమెను తామెప్పుడూ హిజబ్ గురించి ప్రశ్నించలేదని మేనేజ్ మెంట్ వివరణ ఇచ్చింది.

Tags:    

Similar News