Viral Video: డబ్బులు ఇవ్వలేదని యజమాని బెంజ్ కారుకు నిప్పంటించిన కూలీ..

Viral Video: ఓ కూలీ తన యజమాని పనిచేసినప్పటికీ డబ్బులు ఇవ్వలేదని ప్రతీకారం తీర్చుకున్నాడు.

Update: 2022-09-15 06:02 GMT

Viral Video: డబ్బులు ఇవ్వలేదని యజమాని బెంజ్ కారుకు నిప్పంటించిన కూలీ..

Viral Video: ఓ కూలీ తన యజమాని పనిచేసినప్పటికీ డబ్బులు ఇవ్వలేదని ప్రతీకారం తీర్చుకున్నాడు. యాజమానిపై కక్షపెంచుకున్న కూలీ యాజమానికి చెందిన మెర్సిడెజ్ బెంజ్ కారుపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీ టీవీ కెమెరాలో రికార్డయ్యాయి. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని నోయిడా సెక్టార్‌-39లో మంగళవారం జరిగింది. జలాల్‌పుర్‌ గ్రామానికి చెందిన రణ్‌వీర్‌.. నోయిడాలోని సదర్‌పుర్‌ కాలనీకి చెందిన ఆయుష్‌ చౌహాన్‌ ఇంట్లో టైల్స్‌ పని చేశాడు.

ఇందుకు సంబంధించి రణ్‌వీర్‌కు ఆయుష్‌ రూ.68వేలు ఇవ్వాల్సి ఉంది. అనేక సార్లు వచ్చి అడిగినా ఆయుష్‌ డబ్బులు ఇవ్వలేదు. దీంతో విసిగిపోయిన రణ్‌వీర్‌.. మంగళవారం సదర్‌పుర్‌ కాలనీకి బైక్‌పై వచ్చాడు. ఇంటి ముందు పార్క్‌ చేసి ఉన్న మెర్సిడెజ్‌ బెంజ్‌ కారుపై పెట్రోల్‌ పోసి, నిప్పంటించి పారిపోయాడు. ఈ దృశ్యాలు ఇంటి సమీపంలోని సీసీ టీవీ కెమెరాల్లో నమోదయ్యాయి. దర్యాప్తు చేపట్టిన పోలీసులు రణ్ వీర్ ను అరెస్ట్‌ చేశారు. పని చేయించుకుని డబ్బులు ఇవ్వడం లేదన్న కోపంతోనే ఈ ఘటనకు పాల్పడినట్లు వెల్లడించాడు.


Tags:    

Similar News