ప్రధానితో 20 నిమిషాలు భేటీ అయిన కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
Komatireddy Venkat Reddy: మూసీ నది ప్రక్షాళన గురించి ప్రధానికి వివరించాను
ప్రధానితో 20 నిమిషాలు భేటీ అయిన కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
Komatireddy Venkat Reddy: ప్రధాని నరేంద్ర మోడీతో దాదాపు 20 నిమిషాలు సమావేశం అయ్యారు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. మూసీ నదిలో వ్యర్థాలు కలవడం వలన 5 జిల్లా ప్రజలు రోగాల బారిన పడుతున్నట్లు ప్రధానికి వివరించినట్లు తెలిపారు. గంగానదిని ప్రక్షాళన చేసినట్లు.. మూసీని కూడా క్లీన్ చేయమని కోరినట్లు వివరించారు. అంతేకాకా హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారిని ఆరు లైన్లుగా విస్తరించాల్సి అవసరం గురించి ప్రధానికి చెప్పినట్లు తెలిపారు. తాను వెల్లడించిన అంశాలపై మోడీ సానుకూలంగా స్పందించినట్లు కూడా ఎంపీ చెప్పారు. గతంలో కూడా పలు ప్రాజెక్ట్‌ల గురించి ప్రధానికి చెప్పినట్లు తెలిపారు. అయితే ప్రస్తుతం తాను అభివృద్ధిపైనే దృష్టి పెడతానని... రాజకీయాలు మాట్లాడనని కోమటిరెడ్డి స్పష్టం చేశారు.