18th Lok Sabha: తెలుగులో ప్రమాణ స్వీకారం చేసిన కిషన్ రెడ్డి, రామ్మోహన్ నాయుడు
18th Lok Sabha: 18వ లోక్‌సభ తొలి సమావేశాలు ప్రారంభమయ్యాయి. నూతనంగా ఎన్నికైన సభ్యులతో ప్రొటెం స్పీకర్ ప్రమాణం చేయిస్తున్నారు.
18th Lok Sabha: తెలుగులో ప్రమాణ స్వీకారం చేసిన కిషన్ రెడ్డి, రామ్మోహన్ నాయుడు
18th Lok Sabha: 18వ లోక్‌సభ తొలి సమావేశాలు ప్రారంభమయ్యాయి. నూతనంగా ఎన్నికైన సభ్యులతో ప్రొటెం స్పీకర్ ప్రమాణం చేయిస్తున్నారు. తొలుత ప్రధాని మోదీ ఎంపీగా ప్రమాణం చేశారు. అనంతరం కేంద్రమంత్రులు, ఇతర సభ్యులతో ప్రమాణం చేయిస్తున్నారు. ఈక్రమంలో కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, రామ్మోహన్ నాయుడు తెలుగులో ప్రమాణం చేశారు. ఈ రోజు 280 మంది ఎంపీలు ప్రమాణం చేయనున్నారు. మిగిలిన వారితో మంగళవారం ప్రమాణస్వీకారం చేయిస్తారు. అనంతరం స్పీకర్ ఎన్నికకు నామినేషన్ కార్యక్రమం ప్రారంభమవుతుంది. 26న స్పీకర్ ఎన్నిక పూర్తవుతుంది.