Whatsapp: భారత్ లో వాట్సప్ మూగబోనుందా..

Whatsapp: కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి 25న డిజిటల్ మీడియా ఎథిక్స్ కోడ్‌ పేరుతో కొత్త నిబంధనలు తీసుకొచ్చిన సంగతి విదితమే.

Update: 2021-02-26 16:15 GMT

వాట్సప్ (ఫోటో ట్విట్టర్ )

Whatsapp: కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి 25న డిజిటల్ మీడియా ఎథిక్స్ కోడ్‌ పేరుతో కొత్త నిబంధనలు తీసుకొచ్చిన సంగతి విదితమే. ఈ నిబంధనలు అమలైతే ప్రముఖ సోషల్‌ మెసేజింగ్‌ యాప్‌ వాట్సాప్‌కు కష్టమేమని నిపుణులు వెల్లడిస్తున్నారు.

ఈ కొత్త నిబంధనల మేరకు వివాదాస్పద మెసేజ్‌లు ఎక్కడి నుంచి వచ్చాయో తప్పక చెప్పాల్సి ఉంటుంది. అయితే ఈ నిబంధనలను వాట్సాప్‌, సిగ్నల్‌, టెలిగ్రాం వంటి ఇన్‌స్టెంట్ మెసేజింగ్ యాప్‌లు తప్పని సరిగా పాటించాలి.

ఇంతకాలం మెసేజ్‌లకు ఎండ్‌ టూ ఎండ్‌ ఎన్‌క్రిప్షన్‌ భద్రత ఉందని చెబుతున్న ఇలాంటి యాప్‌లకు, సోషల్ మీడియాకు పెద్ద తలనొప్పిగా మారనుంది. తాజా రూల్స్ ప్రకారం వివాదాస్పద మెసేజ్‌ మొదట ఎవరి నుంచి వచ్చిందో కచ్చితంగా చూపించాలి. అలాగే ఓ ట్వీట్‌ లేదా మెసేజ్‌ భారత్‌ నుంచి పోస్ట్‌ కాలేదని తేలితే.. అది ముందుగా భారత్‌లో ఎవరు రిసీవ్‌ చేసుకున్నారో తప్పనిసరిగా వెల్లడించాలని న్యూ ఐటీ నిబంధనలు చెబుతున్నాయి.

ఇదే విషయమై కేంద్ర మంత్రులు ప్రకాష్‌ జవదేకర్‌, రవిశంకర్‌ ప్రసాద్ స్పష్టం చేశారు. గతంలో ఓ మెసేజ్‌ ఎక్కడి నుంచి వచ్చిందో వెల్లడించాలని వాట్సాప్‌ను ప్రభుత్వం కోరింది. అయితే మెసేజ్ లకు ఎండ్‌ టూ ఎండ్‌ ఎన్‌క్రిప్షన్‌ భద్రతకు విరుద్ధమని వాట్సప్ ఆ వివరాలు వెల్లడించేందుకు నిరాకరించింది. ఈ కొత్త నిబంధనలు పాటించకపోతే వాట్సాప్‌తో పాటు ఇతర మెసేజింగ్ సంస్థలను బ్యాన్ చేసే అవకాశం ఉంది.

Tags:    

Similar News