OTT పోకడలపై కేంద్రం కొరడా

OTT పోకడలను నియంత్రించే అంశంపై కేంద్రం సీరియస్

Update: 2021-02-17 08:16 GMT

representational image

OTT ప్లాట్ ఫారమ్ ల పోకడలపై కేంద్రం సీరియస్ గా ఉంది. నెట్ఫ్లిక్స్- అమెజాన్ ప్రైమ్ ఓటిటి ప్లాట్ ఫామ్ లను నియంత్రించే అంశంపై చర్యలు తీసుకునే ఆలోచనలో ఉన్నట్లు కేంద్రం నేడు సుప్రీంకోర్టుకు తెలిపింది. ఒక పిటిషనర్ స్వయంప్రతిపత్త సంస్థ ద్వారా OTT నియంత్రణ కోరుతూ కోర్టును ఆశ్రయించారు.

ముగ్గురు న్యాయమూర్తుల తో కూడిన ధర్మాసనం సంబంధిత సమస్య పరిష్కారం కోసం మొదట ప్రభుత్వాన్ని సంప్రదించాలని అభిప్రాయపడింది. కానీ తరువాత ఆరు వారాల్లోగా తన స్పందనను దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని కోరింది. ఫిబ్రవరి 2020 నుండి సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ప్రతిపాదించిన స్వీయ నియంత్రణ వ్యవస్థ అమలుపై స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ లలో కేవలం ఒకే ఒక్క ఓటీటీ మాత్రమే సంతకం చేసిందని పిటిషన్ పేర్కొంది.

కరోనా లాంటి అనుకోని అవాంతరాలు వచ్చినపుడు OTT స్ట్రీమింగ్ .. విభిన్న డిజిటల్ మీడియా ప్లాట్ ఫారమ్ లు తప్పనిసరిగా వచ్చాయన్నారు. చిత్ర నిర్మాతలు కళాకారులకు ఆందోళన చెందకుండా వారి కంటెంట్ ను విడుదల చేయడానికి ఒక మార్గాన్నిఅన్వేషించాయని న్యాయవాదులు శశాంక్ శేఖర్ .. అపుర్వ అర్హాటియా విజ్ఞప్తి చేశారు.

OTT / స్ట్రీమింగ్ ప్లాట్ ఫారమ్ లపై పర్యవేక్షణ లేకపోవంతో రోజుకో కొత్త సమస్య వస్తూవుండడంతో న్యాయపరంగా అనేక చిక్కులు ఎదుర్కోవాల్సి వస్తోంది. ఫిబ్రవరి 2020 నుండి సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ప్రతిపాదించిన స్వీయ నియంత్రణ వ్యవస్థ అమలుపై స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ లలో కేవలం ఒకే ఒక్క ఓటీటీ మాత్రమే సంతకం చేసిందని పిటిషన్ పేర్కొంది.

Tags:    

Similar News