సరిహద్దులో ఉద్రిక్తత.. కాల్పులకు తెగబడ్డ చైనా.. అధికారి సహా ఇద్దరు జవాన్ల మృతి

భారత్ - చైనా సరిహద్దులో మరోసారి ఉద్రిక్తత నెలకొంది. లడఖ్‌లోని గాల్వన్ ప్రాంతంలో భారతీయ ఆర్మీ చైనా ఆర్మీ మధ్య ఘర్షణ జరిగింది.

Update: 2020-06-16 07:56 GMT

భారత్ - చైనా సరిహద్దులో మరోసారి ఉద్రిక్తత నెలకొంది. లడఖ్‌లోని గాల్వన్ ప్రాంతంలో భారతీయ ఆర్మీ చైనా ఆర్మీ మధ్య ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో చైనా కాల్పులకు తెగబడింది. చైనా ఆర్మీ జరిపిన కాల్పుల్లో భారత ఆర్మీ అధికారి సహా ఇద్దరు భారత సైనికులు మరణించారు. ఈ విషయాన్నీ భారత సైన్యం మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. నియంత్రణ సరిహద్దులో ఉద్రిక్తతలు పెరిగాయని.. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి ఇరువర్గాల సీనియర్ సైనిక అధికారులు ప్రస్తుతం సరిహద్దు వద్ద సమావేశమవుతున్నారు అని పేర్కొంది.

వాస్తవానికి మే 5, 6 తేదీల్లో 250 మంది చైనా, భారతీయ సైనికులు ముఖాముఖికి తరువాత ఈ ప్రాంతంలో పరిస్థితి మరింత దిగజారింది. ఇద్దరిమధ్య పలుమార్లు ఘర్షణ జరిగింది. ఈ నేపథ్యంలో తూర్పు లడఖ్‌లో ప్రతిష్టంభనతో.. ఉత్తర సిక్కిం, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ మరియు అరుణాచల్ ప్రదేశ్‌లోని ఎల్‌ఐసి, చైనా-ఇండియా సరిహద్దులో ఇరు పక్షాలు అదనపు దళాలను మోహరించాయి. దీంతో సమస్యను పరిష్కరించడానికి ఇరువర్గాలు గత కొద్ది రోజులుగా వరుస చర్చలు కూడా జరిపారు. సరిహద్దులో పరిస్థితులు సాధారణ స్థాయికి వచ్చాయని భారత్, చైనా అధికారులు ప్రకటించారు. ఈ క్రమంలో ఉద్రిక్తతలు చోటుచేసుకుండం, ఇందులో ముగ్గురు ఆర్మీ సిబ్బంది మృతిచెందడం దురదృష్టకరం.


Tags:    

Similar News