లడఖ్‌లోని సరిహద్దు గ్రామాలను ఖాళీ చేయడానికి సన్నాహాలు

జూన్ 15 సంఘటన తరువాత, భారత సైన్యం.. లధక్ లోని లేహ్ మరియు ఇతర సరిహద్దులలో తన కదలికను పెంచింది.

Update: 2020-06-19 07:48 GMT

జూన్ 15 సంఘటన తరువాత, భారత సైన్యం.. లధక్ లోని లేహ్ మరియు ఇతర సరిహద్దులలో తన కదలికను పెంచింది. భారత్, చైనాల మధ్య మరోసారి ఉద్రిక్తతలు తలెత్తితే ప్రమాదమని గ్రహించిన భారత సైన్యం ముందు జాగ్రత్త చర్యగా.. లడఖ్‌లోని సరిహద్దు గ్రామాలను ఖాళీ చేయడానికి సన్నాహాలు ప్రారంభించింది. సరిహద్దు వద్ద నివసిస్తున్న గిరిజనులు ఇతర తెగ వారిని ఖాళీ చేయమని భారత సైన్యం కోరింది. వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించడం కోసం ఆర్మీ తగిన ఏర్పాట్లు చేసినట్టు తెలుస్తోంది.

అలాగే డెమ్‌చోక్ పాంగోంగ్ సరస్సు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. సరిహద్దు ప్రాంతాల్లో మొబైల్ ఫోన్లను స్విచ్ ఆఫ్ చేసుకోవాలని సూచించారు. అలాగే కొన్నిచోట్ల టవర్లను నిలిపివేశారు. ఆర్మీ ల్యాండ్‌లైన్ ఫోన్లను కూడా స్విచ్ ఆఫ్ చేశారు. కేవలం ఆపరేషన్‌కు కనెక్ట్ చేయబడిన ఫోన్‌లు మాత్రమే పనిచేస్తున్నాయి. లేహ్ సిటీ వెలుపల, సైన్యం మినహా అన్ని కార్యక్రమాలను నిషేధించారు. శ్రీనగర్-లే హైవే కూడా సామాన్య ప్రజలకు అందుబాటులో లేదు.

 

Tags:    

Similar News