Tamil Nadu: తమిళనాడులో భారీ వర్షాలు.. నీటమునిగిన పలు కాలనీలు, విరిగిపడ్డ చెట్లు
Tamil Nadu: దక్షిణ బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం
Tamil Nadu: తమిళనాడులో భారీ వర్షాలు.. నీటమునిగిన పలు కాలనీలు, విరిగిపడ్డ చెట్లు
Tamil Nadu: తమిళనాడు రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల కారణంగా చెన్నైతో సహా తిరువళ్లూరు, చెంగల్‌పట్టు, కాంచీపురం జిల్లాలకు అధికారులు రెడ్ అలర్ట్ ప్రకటించారు. దక్షిణ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. కాగా ఇప్పటికే రాష్ట్రంలో పలు కాలనీలు నీటమునిగి ..చెట్లు విరిగిపడ్డాయి.అధికారులు సహాయక చర్యలు వేగవంతం చేసారు. భారీ వర్షాల నేపథ్యంలో చెన్నై సహా రాష్ట్రంలోని పలు జిల్లాల పాఠశాలలు, కళాశాలలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది.
మరో 48 గంటల పాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని చెన్నై సహా పలు జిల్లాలకు చెన్నై వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. సముద్రంలో అలల ఉధృతి నేపథ్యంలో మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని ఆదేశాలు చేసింది.