Delhi Pollution: ఢిల్లీ కాలుష్యంపై సుప్రీంకోర్టులో విచారణ

Delhi Pollution: ఢిల్లీ సర్కార్, అధికారులపై ప్రశ్నలవర్షం

Update: 2021-12-02 08:19 GMT

ఢిల్లీ వాయు కాలుష్యం పై సుప్రీమ్ కోర్ట్ లో విచారణ (ఫైల్ ఇమేజ్)

Delhi Pollution: ఢిల్లీ కాలుష్యంపై సుప్రీంకోర్టు మరోసారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎన్ని చర్యలు తీసుకున్నా ఢిల్లీలో గాలి ఎందుకు శుద్ధి కావడంలేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. అలాగే.. రాష్ట్రంలో స్కూళ్ల పునఃప్రారంభంపై కూడా మండిపడింది. పెద్దలేమో ఇంటి నుంచి పనిచేస్తుంటే.. పిల్లలను స్కూల్‌కు పంపిస్తారా అని ఢిల్లీ సర్కారు, అధికారులపై ప్రశ్నల వర్షం కురిపించింది.

ఢిల్లీ కాలుష్యంపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఎన్ని చర్యలు తీసుకున్నా కాలుష్యం పెరుగుతూనే ఉందని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చురకలంటించింది. మూడు నాలుగేళ్ల పిల్లలు స్కూలుకు పోతుంటే.. వారి తల్లిదండ్రులేమో ఇంటి నుంచి పనిచేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే, స్కూలుకు వెళ్లడం వారి ఇష్టానికే వదిలేశామన్న ఢిల్లీ సర్కారు సమాధానానికి సీజేఐ అసహనం వ్యక్తం చేశారు. వర్క్ ఫ్రమ్ హోమ్ ను అమలు చేసి, స్కూళ్లను మూసేసినట్టు ప్రభుత్వం చెప్పిందని, కానీ, తమకు అది ఎక్కడా కనిపించడం లేదని జస్టిస్ ఎన్వీ రమణ ఫైర్ అయ్యారు.

పిల్లలు నడిరోడ్డులో బ్యానర్లు పట్టుకుని ఎందుకు నిలబడుతున్నారంటూ ఢిల్లీ సర్కారును జస్టిస్ సూర్యకాంత్ ప్రశ్నించారు. ఎవరూ వారి ఆరోగ్యం గురించి పట్టించుకోరా అని నిలదీశారు. వారికి కావాలంటే మరిన్ని రక్షణ కవచాలందిస్తామని ఢిల్లీ సర్కారు తరఫున వాదిస్తున్న అడ్వొకేట్ అభిషేక్ మను సింఘ్వీ కోర్టుకు చెప్పారు. ఆయన సమాధానంపై స్పందించిన చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ ఢిల్లీ ప్రభుత్వం నుంచి ఎంతమంది టాస్క్ ఫోర్స్ సభ్యులున్నారు..? కేంద్రం నుంచి ఎంతమంది ఉన్నారని ప్రశ్నించారు.

Full View


Tags:    

Similar News