కేంద్ర మాజీ మంత్రి మృతి!

Kazi Rashid Masood : కేంద్ర మాజీమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత ఖాజీ రషీద్ మసూద్ (73) అనారోగ్యంతో ఇవాళ మరణించారు. ఉత్తరాఖండ్ రూర్కీలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అయన ప్రాణాలు విడిచారు.

Update: 2020-10-05 13:15 GMT

Kazi Rashid Masood

Kazi Rashid Masood : కేంద్ర మాజీమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత ఖాజీ రషీద్ మసూద్ (73) అనారోగ్యంతో ఇవాళ మరణించారు. ఉత్తరాఖండ్ రూర్కీలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అయన ప్రాణాలు విడిచారు. ర‌షీద్ మ‌సూద్ మొత్తం 5సార్లు లోక్‌సభకు, 3సార్లు రాజ్యసభకు ఎన్నికయ్యారు. 1990లో మాజీ ప్రధాని విపి సింగ్ ప్రభుత్వంలో అయన ఆరోగ్యశాఖ మంత్రిగా పనిచేశారు. కాగా, ర‌షీద్ మ‌సూద్‌కు ఆగస్టు 27 న కరోనా సోకగా అయన ఢిల్లీలోని అపోలో ఆసుపత్రిలో చేర్చారు. అక్కడ ఆయన కరోనా నుంచి కోలుకున్నారు.

మళ్లీ అనారోగ్యం బారిన పడడంతో ఆయన మరణించారు. ఈ విషయాన్ని రషీద్ మసూద్ మేనల్లుడు, కాంగ్రెస్ సీనియర్ నేత ఇమ్రాన్ మసూద్ వెల్లడించారు. రషీద్ మసూద్ మొదటిసారి 1977 లో జనతా పార్టీ టికెట్‌పై సహారన్పూర్ సీటు నుండి లోక్ సభకి పోటీ చేసి గెలిచారు.. ఆ తరువాత 1980, 1989,1991 మరియు 2004 లో అదే లోక్ సభ స్థానం నుండి ఎన్నికయ్యారు, 1985, 2009 మరియు 2012 లో రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. అయన మృతిపట్ల కాంగ్రెస్ నాయకులు, ఇతర పార్టీ నేతలు సంతాపం తెలుపుతున్నారు. అయన అంత్యక్రియలు ఆయన స్వస్థలంలో జరగనున్నాయి. 

Tags:    

Similar News