TOP 6 NEWS @ 6PM: ఏపీలో జిబీఎస్‌తో మహిళ మృతి.. GBS కేసులపై స్పందించిన ఏపీ ఆరోగ్య శాఖ మంత్రి
ఏపీలో జిబీఎస్‌తో మహిళ మృతి.. GBS కేసులపై స్పందించిన ఏపీ ఆరోగ్య శాఖ మంత్రి
1) ఏపీలో జిబీఎస్‌తో మహిళ మృతి.. GBS కేసులపై స్పందించిన ఏపీ ఆరోగ్య శాఖ మంత్రి
ఏపీలో గులియన్ బారీ సిండ్రోమ్ వ్యాధితో ఆదివారం ఒక మహిళ చనిపోయిన సంగతి తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లో జీబీఎస్ వ్యాధి కారణంగా నమోదైన తొలి మరణం ఇదే. దీంతో జీబీఎస్ వ్యాప్తిపై, వ్యాధి తీవ్రతపై జనంలో ఆందోళన వ్యక్తమవుతోంది. ఇదే విషయమై తాజాగా ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ మీడియాతో మాట్లాడారు. జీబీఎస్ వ్యాధి గురించి జనం ఆందోళన పడాల్సిన అవసరం లేదన్నారు. చికిత్స తీసుకోకుండానే ఈ వ్యాధి నయమైపోతుందన్నారు. అంతేకాదు... ఈ వ్యాధి వచ్చిన వారి చికిత్సకు అవసరమయ్యే మెడిసిన్ స్టాక్ ఉందన్నారు.
2) టీజీఎస్‌ఆర్టీసీ గుడ్ న్యూస్.. హైదరాబాద్ టు బెంగళూరు ప్రయాణికులకు టికెట్ రేట్లపై డిస్కౌంట్
తెలంగాణ నుంచి బెంగుళూరుకు ప్రయాణించే వారికి టీజీఎస్ ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. ఈ మార్గంలో ప్రయాణించే ప్రయాణికులకు ఛార్జీల్లో ప్రత్యేక డిస్కౌంట్ ఇచ్చింది. తెలంగాణ నుంచి బెంగుళూరు ప్రయాణించే వారికి 10 శాతం రాయితీ కల్పిస్తున్నట్టు వెల్లడించింది. అన్ని సర్వీసులకు ఈ డిస్కౌంట్ వర్తింపు ఉంటుందని ఇందుకు సంబంధించి ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్ వేదికగా ప్రకటించారు.
దేశంలోని ప్రధాన నగరాల్లో బెంగళూరు ఒకటి. ఐటీ హబ్‌గా బెంగళూరుకు గుర్తింపు ఉంది. హైదరాబాద్ నుంచి పెద్ద ఎత్తున ఐటీ ఉద్యోగులు, విద్యార్థులు బెంగళూరుకు రాకపోకలు సాగిస్తుంటారు. ఆ జాబితాలో ఉద్యోగులతో పాటు వ్యాపారులు కూడా ఉన్నారు. వీరేకాకుండా అనేక మంది వేర్వేరు పనుల నిమిత్తం తరచుగా హైదరాబాద్ - బెంగళూరు మధ్య రాకపోకలు సాగిస్తుంటారు. మరీ ముఖ్యంగా శని, ఆదివారాల్లో ఈ రూట్‌లో ప్రయాణించే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఇలారాకపోకలు సాగించే వారిలో ఎక్కువ మంది ప్రైవేట్ ట్రావెల్స్‌ను ఆశ్రయిస్తున్నారు. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని ఆర్టీసీ ఈ నిర్ణయం తీసుకున్నట్టు స్పష్టమవుతోంది. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
3) మోదీపై రేవంత్, రాహుల్ పై బండి: తెలంగాణలో కులాలపై వ్యాఖ్యలు
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లీగల్లీ కన్వర్టెడ్ బీసీ అంటూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. ఈ వ్యాఖ్యలకు అదే స్థాయిలో బీజేపీ కౌంటరిచ్చింది. రాహుల్ గాంధీ ముస్లిం అంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ మండిపడింది. రాహుల్ గాంధీ కుటుంబంపై బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి మండిపడ్డారు. అసలు ఈ వివాదానికి కారణం ఏంటి? ఎవరు ఏమన్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
రేవంత్ రెడ్డి ఏమన్నారంటే? ప్రధాని నరేంద్ర మోదీ పుట్టుకతో ఓబీసీ కాదు. లీగల్లీ కన్వర్టెడ్ బీసీ అంటూ రేవంత్ రెడ్డి ఫిబ్రవరి 14న అన్నారు. గాంధీ భవన్ లో నిర్వహించిన కులగణన సర్వే పవర్ పాయింట్ ప్రజేంటేషన్ లో రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా మోదీ బాధ్యతలు చేపట్టిన తర్వాత తన కులాన్ని బీసీ కులాల్లో కలుపుకున్నారని రేవంత్ రెడ్డి అన్నారు. మోదీ కులం బీసీ సామాజిక వర్గం కాదని, ఉన్నత సామాజికవర్గమని రేవంత్ రెడ్డి ఆరోపించారు. రేవంత్ వ్యాఖ్యలపై బండి సంజయ్ కౌంటర్... పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
4) Shallow Earthquake: ఒక సాధారణ భూకంపం ఢిల్లీని ఎప్పటికంటే ఎక్కువ ఎందుకు భయపెట్టింది?
What is Shallow Earthquake: ఢిల్లీలో భూకంపాలు రావడం కొత్తేం కాదు. ఢిల్లీ నుండి హిమాలయాల వరకు తరచుగా భూకంపాలు వస్తూనే ఉంటాయి. పైగా ఢిల్లీలో 5.0 మ్యాగ్నిట్యూడ్ కంటే ఎక్కువ తీవ్రతతో భూకంపం వచ్చిన సందర్భాలే ఎక్కువగా ఉన్నాయి. కానీ ఫిబ్రవరి 17న వచ్చిన భూకంపం తీవ్రత మాత్రం అంతకంటే తక్కువగా 4.0 గా నమోదైంది. అయినప్పటికీ గతంలో కంటే ఈ భూకంపం తీవ్రతే ఢిల్లీ వాసులను ఎక్కువగా భయపెట్టింది.
ఇదే విషయమై ఢిల్లీ వాసులు స్పందిస్తూ... తాము ఇంతలా వణికించిన భూకంపాన్ని గతంలో ఎన్నడూ చూడలేదని చెబుతున్నారు. మరి తక్కువ తీవ్రతతో వచ్చిన భూకంపం వల్లే భూమి ఎక్కువగా కంపించడానికి కారణం ఏంటి? అసలు భూకంపం ఎన్నిరకాలు? వాటిని ఎలా విభజిస్తారు అనేది ఇప్పుడు తెలుసుకుందాం. పూర్తి వివరణాత్మక కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
5) Gold Reserves: బంగారం నిల్వల్లో రారాజు అమెరికా... మరి భారత్ స్థానం ఎంత?
Gold Reserves: ప్రపంచంలోని అత్యంత విలువైన లోహాలలో బంగారం ఒకటి. మహిళలు బంగారానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. అయితే ఇది కేవలం అలంకరణ వస్తువులు, ఆభరణాలకే పరిమితం కాదు. ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తుంది. దేశ ఆర్థిక స్థిరత్వాన్ని బలోపేతం చేయడంలో సహాయపడుతుంది. అందుకే ప్రతి దేశం బంగారాన్ని నిల్వ చేసుకునేందుకు ప్రాధాన్యత ఇస్తాయి. అవసరమైతే వాటిని పెంచుకునేందుకు ప్రయత్నిస్తాయి. ఒక దేశ కరెన్సీ విలువను కూడా బంగారం నిల్వలు ప్రభావితం చేస్తాయంటే బంగారానికి ఉండే విలువ ఏంటో అర్థం చేసుకోవచ్చు.
ముఖ్యంగా భారతీయులకు బంగారానికి విడదీయలేని బంధం ఉంది. ప్రపంచంలో భారతీయులు ఉపయోగించినంత బంగారాన్ని మరే దేశస్తులు వినియోగించరేమో. పిల్లల బారసాల ఫంక్షన్ నుంచి ప్రతి శుభకార్యాలయాలకు బంగారం తప్పనిసరి. ఒకరకంగా బంగారం లేకుండా ఏ ఫంక్షన్ కూడా జరగదని చెప్పొచ్చు. మన భారతీయులకు బంగారం అంటే అంత మక్కువ. ఏటా టన్నుల కొద్ది భారత్‌కు బంగారం దిగుమతి అవుతోంది. దేశం ఆర్థికంగా కుదేలైనా, మరేదైనా సవాళ్లు ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు బంగారం నిల్వలే కాపాడతాయని ప్రభుత్వాల నమ్మకం. అందుకే భారత్ ఇటీవల ఏకంగా 100 టన్నుల బంగారాన్ని ఇండియాకు తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. పూర్తి వివరణాత్మక కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
6) Chava movie: ఛావా సినిమాను మిస్ చేసుకున్న టాలీవుడ్ హీరో.. ఇంతకు అతను ఎవరంటే..?
Chava movie: బాలీవుడ్ స్టార్ హీరో విక్కీ కౌశల్, రష్మిక మందన్న నటించి సినిమా ఛావా. ఫిబ్రవరి 14న రిలీజైన ఈ సినిమా రికార్డ్స్ క్రియేట్ చేస్తోంది. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింగ వైరల్ అవుతోంది. ఛావా సినిమాను టాలీవుడ్ స్టారో హీరో మిస్ చేసుకున్నారనే వార్త వినిపిస్తోంది. ఇంతకీ ఆ హీరో ఎవరా అనేగా మీ సందేహం. అతను ఎవరో కాదు ప్రిన్స్ మహేష్ బాబు.
మరాఠా యోధుడు ఛత్రపతి మహరాజ్ శివాజీ కుమారుడు శంభాజీ జీవిత చరిత్ర ఆధారంగా దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్ ఈ సినిమాను తెరకెక్కించారు. అయితే ఈ సినిమా కథను మొదట లక్ష్మణ్.. మహేష్ బాబుకు వినిపించారని టాక్ నడుస్తోంది. కానీ మహేష్ ఈ సినిమా చేయడానికి అంత ఆసక్తి చూపలేదట. దీంతో కొంతకాలం తర్వాత ఈ కథను విక్కీ కౌశల్‌కు వినిపించారట డైరెక్టర్.. కథ నచ్చడంతో ఒకే చెప్పేశారంట విక్కీ. అలా మహేష్ ఈ సినిమాను మిస్ చేసుకున్నాని టాక్. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి.