Shallow Earthquake: సాధారణ భూకంపమే ఢిల్లీని ఎప్పటికంటే ఎక్కువ భయపెట్టింది.. కారణం?

What is Shallow Earthquake why it scared delhi people during Delhi earthquake and know how many types of earthquakes exists
x

Shallow Earthquake: 4.0 మ్యాగ్నిట్యూడ్ సాధారణ భూకంపం ఢిల్లీని ఎప్పటికంటే ఎక్కువ ఎందుకు భయపెట్టింది?

Highlights

What is Shallow Earthquake: ఢిల్లీలో భూకంపాలు రావడం కొత్తేం కాదు. ఢిల్లీ నుండి హిమాలయాల వరకు తరచుగా భూకంపాలు వస్తూనే ఉంటాయి. పైగా ఢిల్లీలో 5.0...

What is Shallow Earthquake: ఢిల్లీలో భూకంపాలు రావడం కొత్తేం కాదు. ఢిల్లీ నుండి హిమాలయాల వరకు తరచుగా భూకంపాలు వస్తూనే ఉంటాయి. పైగా ఢిల్లీలో 5.0 మ్యాగ్నిట్యూడ్ కంటే ఎక్కువ తీవ్రతతో భూకంపం వచ్చిన సందర్భాలే ఎక్కువగా ఉన్నాయి. కానీ ఫిబ్రవరి 17న వచ్చిన భూకంపం తీవ్రత మాత్రం అంతకంటే తక్కువగా 4.0 గా నమోదైంది. అయినప్పటికీ గతంలో కంటే ఈ భూకంపం తీవ్రతే ఢిల్లీ వాసులను ఎక్కువగా భయపెట్టింది.

ఇదే విషయమై ఢిల్లీ వాసులు స్పందిస్తూ... తాము ఇంతలా వణికించిన భూకంపాన్ని గతంలో ఎన్నడూ చూడలేదని చెబుతున్నారు. మరి తక్కువ తీవ్రతతో వచ్చిన భూకంపం వల్లే భూమి ఎక్కువగా కంపించడానికి కారణం ఏంటి? అసలు భూకంపం ఎన్నిరకాలు? వాటిని ఎలా విభజిస్తారు అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

ఢిల్లీలో సోమవారం తెల్లవారిజామున 5 గంటల 36 నిమిషాలకు భూకంపం వచ్చింది. భవనాలు ఒక్కసారిగా షేక్ అయ్యాయి. దాంతో జనం భయంతో ఇళ్లలోంచి బయటకు పరుగులు తీశారు. రిక్టార్ స్కేలుపై 4.0 మ్యాగ్నిట్యూడ్‌తో భూకంపం వచ్చినట్లుగా జాతీయ భూకంప అధ్యయన కేంద్రం చెప్పింది. ఢిల్లీలోని దౌలాకాన్ కింద భూకంప కేంద్రం ఉన్నట్లు నేషనల్ సైజ్మాలజీ సెంటర్ ప్రకటించింది.

ఢిల్లీని భయపెట్టిన షాలో ఎర్త్‌క్వేక్

4.0 మ్యాగ్నిట్యూడ్‌తో వచ్చిన సాధారణ భూకంపం అంతగా భయపెట్టడానికి రెండు ముఖ్యమైన కారణాలున్నాయి. అందులో ఒకటి భూకంప కేంద్రం ఢిల్లీలోనే ఉండటమైతే, రెండోది ఆ భూకంప కేంద్రం భూమికి తక్కువ లోతులోనే ఉండటం. ఇలా తక్కువ లోతులో భూకంప కేంద్రంతో వచ్చే భూకంపాన్ని షాలో ఎర్త్‌క్వేక్ అంటారు.

గతంలో ఢిల్లీలో ఇంతకంటే ఎక్కువ తీవ్రతతో భూకంపాలు వచ్చినప్పటికీ... వాటి భూకంప కేంద్రాలు ఢిల్లీకి దూరంగా ఉన్న సందర్భాలే ఎక్కువ. ఉదాహరణకు ఢిల్లీలో భూకంపం వచ్చిన ఎన్నో సందర్భాల్లో దాని భూకంప కేంద్రాలు ఆఫ్ఘనిస్తాన్‌లో లేదంటే హిందూకుష్ పర్వతాల్లో ఉన్న సందర్భాలే ఎక్కువగా ఉన్నాయి. అందుకే ఆ భూకంపాలు ఢిల్లీని అంతగా షేక్ చేయలేకపోయాయి.

ఈ భూకంపం ఢిల్లీ వాసులను ఎందుకంత భయపెట్టిందనే విషయాన్ని నేషనల్ సైజ్మాలజీ సెంటర్ డైరెక్టర్ ఓపి మిశ్రా విశ్లేషించారు. ఎక్కడైతే భూకంప కేంద్రం ఉంటుందో, అక్కడ భూమి కంపించే తీవ్రత ఎక్కువగా ఉంటుంది. భూకంప తరంగాలు ఎక్కువ దూరం ప్రయాణించే వీలు లేకుండా కొద్దిదూరంలోనే భవనాలను తాకడమే అందుకు కారణం. అందుకే రిక్టార్ స్కేలుపై భూకంపం తవ్రత తక్కువగానే చూపించినప్పటికీ భవన నిర్మాణాలపై దాని ప్రభావం ఎక్కువగానే ఉంటుందన్నారు. అలాగే ఈ భూకంపం ఎపిక్ సెంటర్ భూమికి కేవలం 5 కిమీలోతులోనే ఉంది. ఇంతకు ముందు చెప్పుకున్నట్లుగా ఇలా తక్కువ లోతులో భూకంప కేంద్రం ఉండటాన్ని షాలో ఎర్త్‌కేక్ అంటారని మిశ్రా తెలిపారు. భూకంప కేంద్రం భూమికి ఎంత లోతుగా ఉంటే... దాని ప్రకంపనల తీవ్రత అంత తక్కువగా ఉంటుందన్నారు.

షాలో ఎర్త్‌క్వేక్ వచ్చినప్పుడు భారీ అంతస్తుల భవనాలపై ఎక్కువ ప్రభావం కనిపిస్తుంది. కొన్నిసార్లు నేల స్వభావం కూడా ఈ ప్రభావం ఇంకా ఎక్కువ కనిపించేలా చేస్తుంది.

టెక్టోనిక్ ఎర్త్‌క్వేక్

భూకంపాలు ప్రధానంగా నాలుగు రకాలున్నాయి. అందులో మొదిటిది టెక్టోనిక్ ఎర్క్‌క్వేక్ అంటారు. ఇది సాధారణంగా ఎప్పుడూ వచ్చే భూకంపం. ఇందులో భూకంప కేంద్రం తక్కువ లోతులో ఉంటే దానిని షాలో ఎర్త్‌క్వేక్ అంటారు. చాలాచాలా తక్కువ సందర్భాల్లో ఇలాంటి భూకంపాలు వస్తుంటాయి. 70 కిమీ కంటే ఎక్కువ లోతులో వచ్చేవి మధ్యస్త రకం భూకంపాలు. సాధారణంగా వచ్చే భూకంపాలు ఎక్కువగా ఈ కోవలోకే వస్తాయి.

ఓల్కానిక్ ఎర్త్‌క్వేక్

టెక్టోనిక్ ఎర్క్‌క్వేక్ కాకుండా వచ్చే రెండో రకం వోల్కానిక్ ఎర్త్‌క్వేక్ అంటారు. అగ్నిపర్వతాల కింద ఉండే లావా ప్రవాహాన్ని మ్యాగ్మా అంటుంటారు. ఈ అగ్ని ప్రవాహం వల్ల కానీ లేదా బూడిద వల్ల వచ్చే భూకంపాన్ని వోల్కనిక్ ఎ‌ర్త్‌క్వేక్ అంటారు. ఇవి అగ్నిపర్వతాలు ఉండే ప్రాంతాల్లోనే ఇలాంటి భూకంపాలు వస్తుంటాయి. జనావాసాల ప్రాంతంలో ఇలాంటి భూకంపం వస్తే జరిగే నష్టం ఎక్కువగా ఉంటుందని సైజ్మాలజిస్టులు చెబుతున్నారు.

ఎక్స్‌ప్లోజన్ ఎర్త్‌క్వేక్

ఇక మూడో రకం భూకంపాన్ని ఎక్స్‌ప్లోజన్ ఎర్త్‌క్వేక్ అంటారు. భూమిపై ఏవైనా భారీ పేలుడు జరిగినప్పుడు వస్తుంది. ఉదాహరణకు న్యూక్లియర్ బాంబు పేలుళ్ల లాంటి భారీ విస్పోటనం జరిగినప్పుడు ఇలాంటి భూకంపాలు సంభవిస్తాయి. సాధారణ పేలుళ్లకు భూమిని కంపించేంత శక్తి ఉండదు.

కొలాప్స్ ఎర్త్‌క్వేక్

నాలుగో రకం భూకంపాన్ని కొలాప్స్ ఎర్త్‌క్వేక్ అంటారు. అంటే భూమిపై ఏదైనా భారీ కట్టడం లేదా ఏదైనా గనులు కుప్పకూలినప్పుడు దాని తీవ్రత వల్ల కలిగే భూకంపం అన్నమాట. అయితే చివరి మూడు భూకంపాలు చాలాచాలా అరుదైన భూకంపాలు అనే చెప్పుకోవాలి. సాధారణంగా తరుచుగా వచ్చే భూకంపాలన్నీ మొదటి రకమైన టెక్టోనిక్ ఎర్క్‌క్వేక్ కిందకే వస్తాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories