నిరుద్యోగులు అలర్ట్.. పొరపాటున దీనికి అప్లై చేయవద్దు..

Fraud Alert: నిరుద్యోగుల కల ప్రభుత్వ ఉద్యోగం. ఎందుకంటే దీనికి ఎల్లప్పుడు డిమాండ్‌ ఉంటుంది. అంతేకాదు సమాజంలో మంచి గౌరవ, మర్యాదలు లభిస్తాయి.

Update: 2022-03-24 09:37 GMT

నిరుద్యోగులు అలర్ట్.. పొరపాటున దీనికి అప్లై చేయవద్దు..

Fraud Alert: నిరుద్యోగుల కల ప్రభుత్వ ఉద్యోగం. ఎందుకంటే దీనికి ఎల్లప్పుడు డిమాండ్‌ ఉంటుంది. అంతేకాదు సమాజంలో మంచి గౌరవ, మర్యాదలు లభిస్తాయి. అందుకే కొన్ని రకాల ముఠాలు నిరుద్యోగులని టార్గెట్‌ చేస్తున్నాయి. ఉద్యోగం పేరుతో వారిని బోల్తా కొట్టించి అందినకాడికి దోచుకుంటున్నాయి. వాస్తవానికి ప్రభుత్వ ఉద్యోగాల పేరుతో జరుగుతున్న మోసాలపై ఎప్పటికప్పుడు ప్రభుత్వం హెచ్చరిస్తూనే ఉంది. తాజాగా ఇండియన్ మిషన్ ఎంప్లాయ్‌మెంట్ స్కీమ్ కింద ఉద్యోగాల పేరుతో ఒక కాల్‌ లెటర్ సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఈ కాల్ లెటర్‌లో ప్రభుత్వం ఇండియన్ మిషన్ ఎంప్లాయ్‌మెంట్ స్కీమ్ కింద కస్టమర్ సర్వీస్ ప్రతినిధిని నియమిస్తున్నట్లు చెబుతున్నారు. నెలకు రూ.35,000 జీతం, ఇతర ప్రయోజనాలు ఉంటాయని నమ్మిస్తున్నారు. దీంతో పాటు ఉద్యోగ వివరాలను కూడా అందులో పొందుపరిచారు. ఇదొక్కటే కాదు ఈ ఉద్యోగం కావాలంటే రూ.1280 వెరిఫికేషన్ ఫీజు చెల్లించాలని కోరుతున్నారు. ఇందుకోసం దరఖాస్తుదారునికి 72 గంటల సమయం ఇస్తున్నారు.

ఈ సర్క్యులేట్ మెసేజ్‌ని PIB చెక్‌ చేసింది. ఇది పూర్తిగా నకిలీ సందేశమని పేర్కొంది. PIB 'కేంద్ర ప్రభుత్వం యొక్క ఇండియన్ మిషన్ ఎంప్లాయ్‌మెంట్ స్కీమ్ కింద, అభ్యర్థి దరఖాస్తు రుసుము చెల్లించి కస్టమర్ సర్వీస్ ప్రతినిధిగా నియమించారని చెబుతున్నారు. ఇది పూర్తిగా నకిలీ' అని సూచించింది. నిరుద్యోగులు ఇలాంటి నకిలీ, టెంప్టింగ్ ఆఫర్‌ల పట్ల జాగ్రత్తగా ఉండాలని PIB ఫాక్ట్ చెక్ హెచ్చరించింది. ఉద్యోగాల పేరుతో ఇలాంటి సందేశాలు మొబైల్‌కి వచ్చినప్పుడు వాటిని కచ్చితంగా క్రాస్‌ చెక్ చేయాలని సూచించింది. దీంతో పాటు .gov.in పొడిగింపుతో ముగిసే వెబ్‌సైట్‌లు మాత్రమే నమ్మదగినవని తెలిపింది.

 

Tags:    

Similar News