Supreme Court: ఏడేళ్ళ కంటే తక్కువ శిక్ష పడే కేసుల్లో అరెస్టులు వద్దు..

Supreme Court: కరోనా సెకండ్‌ వేవ్‌ నేపథ్యంలో జైళ్లను ఖాళీ చేయడంపై సుప్రీంకోర్టు దృష్టి సారించింది.

Update: 2021-05-09 03:45 GMT

సుప్రీంకోర్టు(ఫైల్ ఇమేజ్ )


Supreme Court: కరోనా సెకండ్‌ వేవ్‌ నేపథ్యంలో జైళ్లను ఖాళీ చేయడంపై సుప్రీంకోర్టు దృష్టి సారించింది. ఏడేళ్ళ కన్నా తక్కువ శిక్ష పడే నేరాల్లో నిందితులను అవసరమైతే తప్ప అరెస్టు చేయవద్దని పోలీసులకు తెలిపింది. జైళ్లలో ఉంటున్న ఖైదీలకు అవసరమైన వైద్య సదుపాయాలను కల్పించాలని జైళ్ళ శాఖ అధికారులను ఆదేశించింది. ఖైదీలకు కరోనా సోకుతుండటంపై దాఖలైన పిటిషన్‌పై విచారణ సందర్భంగా సుప్రీం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమణ నేతృత్వంలోని ధర్మాసనం ఈ ఆదేశాలు ఇచ్చింది. జైళ్ళలో ఉంటున్న ఖైదీల్లో కరోనా సోకడానికి అవకాశం ఉన్నవారిని అత్యవసరంగా గుర్తించాలని ఆదేశించింది. ఈ మహమ్మారి నుంచి గట్టెక్కడం కోసం గత ఏడాది పెరోల్ మంజూరు చేసినవారికి, మరోసారి 90 రోజుల సెలవును మంజూరు చేయాలని ఆదేశించింది.

Tags:    

Similar News