Karnataka: గ్రామంలోకి ప్రవేశించిన భారీ మొసలి

Karnataka: సాధారణంగా అడవుల్లో ఉండే జంతువులు గ్రామాల్లోకి ప్రవేశించడాన్ని చూసి ఉంటాం బయంతో పరుగులు తీసిన సందర్భాలున్నాయి.

Update: 2021-07-01 11:54 GMT

Karnataka: గ్రామంలోకి ప్రవేశించిన భారీ మొసలి

Karnataka: సాధారణంగా అడవుల్లో ఉండే జంతువులు గ్రామాల్లోకి ప్రవేశించడాన్ని చూసి ఉంటాం బయంతో పరుగులు తీసిన సందర్భాలున్నాయి. ఇక నదులు, కాలువల్లో ఉండే మొసళ్లు కనిపిస్తేనే భయపడుతాం. ఒక్కో సారి చెరువుల్లోకి మొసళ్లు వస్తే ఆమడదూరం పరిగెడతాం అటువైపు వెళ్లేందుకు కూడా సాహయం చేయం. మరి ఊర్లోకి మొసళ్లు వస్తే ఏం చేస్తాం. భయంతో ఇళ్ల తలుపులు మూసేసుకుంటాం ఇలాంటి ఘటనే కర్నాటకలోని ఓ గ్రామంలో చోటు చేసుకుంది. కోగిల్టాన్ గ్రామంలోకి ఓ భారీ మొసలి వచ్చింది. ఇది చూసిన గ్రామస్థులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఇళ్లను మూసేసుకోవడంతో ఆ కాలనీ అంతా నిర్మానుష్యంగా మారింది. సమాచారం తెలుసుకున్న అటవీ శాఖ అధికారులు సిబ్బందితో కలిసి ఆ మొసలిని బందించి నదిలో వదిలేయటంతో గ్రామస్తులు ఊపరి పీల్చుకున్నారు.


Tags:    

Similar News