covid 19 vaccine: కోవిడ్-19 వ్యాక్సిన్ : భారత్ బయోటెక్ కీల‌క‌ ముంద‌డుగు.. వచ్చే నెలలోనే క్లినికల్‌ పరీక్షలు

covid 19 vaccine in india: కరోనా మహమ్మారికి చెక్ పెట్టేందుకు భారత్‌ బయోటెక్‌ అభివృద్ధి చేసిన ‘కొవాగ్జిన్‌’ టీకాపై మరో ముందడుగు పడింది.

Update: 2020-06-30 03:05 GMT

covid 19 vaccine in india:   కరోనా మహమ్మారికి చెక్ పెట్టేందుకు భారత్‌ బయోటెక్‌ అభివృద్ధి చేసిన 'కొవాగ్జిన్‌' టీకాపై మరో ముందడుగు పడింది. 'కొవాగ్జిన్‌' టీకాను ఐసీఎంఆర్‌ పుణెలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ (ఎన్‌ఐవీ) సహకారంతో... భారత్‌ బయోటెక్‌ ఇంటర్నేషనల్‌ అభివృద్ధి చేస్తున్న విషయం తెలిసిందే.

'హ్యూమ‌ల్ ట్ర‌యిల్స్ ఫేజ్‌-1, ఫేజ్‌-2 పరీక్షలకు డీసీజీఐ అనుమతి ఇచ్చింది. కోవిడ్-19 నియంత్రణకు తయారవుతున్న మొద‌టి స్వదేశీ వ్యాక్సిన్‌ ఇదే. ప్రీ-క్లినికల్‌ సంబంధించి తాము అధ్యయనాలకు ఆధారంగా పరీక్షలకు డీసీజీఐ అనుమతి ఇచ్చినట్లు భారత్‌ బయోటెక్‌ ఇంటర్నేషనల్‌ స్పష్టం చేసింది. మొదటి-రెండో దశ క్లినికల్‌ పరీక్షలను జూలైలో మనుషులపై నిర్వహిస్తామని వెల్లడించింది. ఇందులో భాగంగా సార్స్‌- కోవ్‌- 2 వైరస్‌ స్ట్రెయిన్‌ను ఎన్‌ఐవీ.. భారత్‌ బయోటెక్‌కు బదిలీ చేసింది తదనంతరం హైదరాబాద్‌లోని భారత్‌ బయోటెక్‌కు చెందిన బయో సేఫ్టీ లెవల్‌ - 3 ప్రయోగశాలలో టీకాను తయారు చేశారు.

'వీరో సెల్‌ కల్చర్‌ ప్లాట్‌ఫామ్‌ టెక్నాలజీస్‌' ను ఆవిష్కరించటంలో భారత్‌ బయోటెక్‌కు ఎంతో అనుభవం ఉన్న విషయం తెలిసిందే. ఈ సాంకేతిక పరిజ్ఞానంతో ఇప్పటి వరకూ పోలియో, రేబిస్‌, రొటావైరస్‌, జేఈ (జపనీస్‌ ఎన్‌సెఫలైటిస్‌), చికున్‌గున్యా, జికా టీకాలను భారత్‌ బయోటెక్‌ ఆవిష్కరించారు.

కరోనా వైరస్ చెక్ పెట్టేందుకు అభివృద్ధి చేసిన వాక్సిన్ కొవాగ్జిన్‌పై భారత్‌ బయోటెక్‌ ఛైర్మన్‌ అండ్‌ మ్యానేజింగ్ డైరెక్టర్ డాక్టర్‌ కృష్ణ ఎల్ల సంతోషం వెలిబుచ్చారు. ఇది తమకు ఎంతో గర్వించదగ్గ సందర్భమని వివరించారు.

వచ్చే నెలలోనే మొదటి-రెండో దశ క్లినికల్‌ పరీక్షలు ప్రారంభిస్తామని తెలిపారు. ప్రభుత్వ సంస్థల సహకారంతో పాటు భారత్‌ బయోటెక్‌లోని పరిశోధన- అభివృద్ధి విభాగం, తయారీ విభాగాల్లోని సిబ్బంది శ్రమ ఫలితంగా టీకా రూపుదిద్దుకున్నట్లు పేర్కొన్నారు. టీకాను త్వరగా అందుబాటులోకి తీసుకురావాలనే ఆలోచనతో ఉన్నట్లు భారత్‌ బయోటెక్‌ జాయింట్‌ ఎండీ సుచిత్ర ఎల్ల తెలిపారు.  

Tags:    

Similar News