సీఎం సహాయనిధికి భారత్‌ బయోటెక్‌ 2 కోట్ల విరాళం

Arun Chilukuri
Updated on: 5 May 2020 6:00 PM IST
సీఎం సహాయనిధికి భారత్‌ బయోటెక్‌ 2 కోట్ల విరాళం
X

కరోనా వైరస్ ని కట్టడి చేయడానికి ప్రభుత్వాలు ఎన్నో కఠినమైన చర్యలను తీసుకుంటున్నాయి. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి ప్రజలు కూడా కట్టుబడి ఉంటున్నారు. అంతే కాదు కరోనా బాదితులను, పేదవారికి ఆదుకోవడానికి సీఎం సహాయనిధికి, పీఎం సహాయనిధికి ఎంతో మంది మంచి మనసుతో విరాళాలు ఇస్తున్నారు. ఉద్యోగులు, సినీ ఇండస్ట్రీవారు, అధికారులు, నాయకులు ఇలా ప్రతి ఒక్కరు తమకు తోచిన సాయం చేస్తున్నారు.

తాజాగా కరోనా వైరస్ ను కట్టడి చేసేందుకు ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు తమవంతు సాయంగా భారత్ బయోటెక్ కంపెనీ రూ. 2 కోట్ల భారీ విరాళాన్ని ముఖ్యమంత్రి సహాయనిధికి అందించింది. సీఎం కేసీఆర్‌కు భారత్‌ బయోటెక్‌ చైర్మన్‌, ఎండీ కృష్ణ ఎం. ఎల్లా, సుచిత్ర కె. ఎల్లా కలిసి చెక్కును అందజేశారు. త్వరలోనే కరోనా వ్యాక్సిన్‌ ఆవిష్కరించనున్నట్లు కృష్ణ ఎం. ఎల్లా వెల్లడించారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story