Coronavirus Updates in Telangana: తెలంగాణలో మళ్ళీ భారీగా పెరిగిన కరోనా కేసులు!

Coronavirus Updates in Telangana:తెలంగాణలో గత కొద్దిరోజులుగా కరోనా కేసులు పెరుగుతున్న సంగతి తెలిసిందే.. తాజాగా గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 975 కరోనా కేసులు నమోదు అయ్యాయి.

Krishna
Updated on: 1 July 2020 5:49 PM IST
Coronavirus Updates in Telangana: తెలంగాణలో మళ్ళీ భారీగా పెరిగిన కరోనా కేసులు!
X

Coronavirus Updates in Telangana: తెలంగాణ లో గత కొద్దిరోజులుగా కరోనా కేసులు పెరుగుతున్న సంగతి తెలిసిందే.. తాజాగా గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 975 కరోనా కేసులు నమోదు అయ్యాయి. దీనితో తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 15, 394 కి చేరుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 9559 యాక్టివ్ కేసులు ఉండగా, కరోనా నుంచి 5582 మంది కోలుకున్నారు. ఇక ఇవ్వాలా 410 మంది డిశ్చార్జ్ కాగా, ఆరుగురు మృతి చెందారు.

తాజాగా నమోదైన కేసులలో ఒక్క GHMC పరిధిలోనే 861 కేసులు ఉన్నాయి. ఇక రంగారెడ్డిలో 40, మేడ్చెల్ లో 20, సంగారెడ్డిలో 14, కరీంనగర్ లో 10, మహబూబ్ నగర్ లో మూడు, భద్రాద్రి 8, వరంగల్ అర్బన్ లో 4 , వరంగల్ రూరుల్ 5 , నల్గొండ, కామారెడ్డిలో రెండేసి కేసులు, ఇక సిద్దిపేట, గద్వాల్, మహబూబాబాద్, ఆసిఫాబాద్ లలో ఒక్కో కేసు నమోదు అయింది.

ఇక ఇందులో ఒక్క GHMC పరిధిలోనే కరోనా కేసులు అత్యధికంగా పెరుగుతుండడం ఆందోళనకు గురి చేస్తోంది.. దీనితో గ్రేటర్ హైదరాబాద్ లో మరో 15 రోజుల పాటు మళ్లీ లాక్‌డౌన్ విధించాలని తెలంగాణ ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. నిన్న (ఆదివారం) ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో కరోనా వ్యాప్తి, నివారణకు తీసుకుంటున్న చర్యలు, బాధితులకు చికిత్స అందిస్తోన్న తీరు, భవిష్యత్తులో అనుసరించాల్సిన వ్యూహంపై ఈ భేటీలో సమాలోచనలు జరిపారు. ఇందులో అధికారులు హైదరాబాద్ లో 15 రోజుల పాటు మళ్లీ లాక్‌డౌన్ విధించాలని నివేదించారు. ఈ మేరకు సానుకూలంగా స్పందించిన సీఎం కేసీఆర్ లాక్ డౌన్ విధించేందుకు విధివిధానాలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.



Krishna

Krishna

Next Story