Coronavirus Updates: చైనా అధ్యక్షుడిపై కేసు.. సాక్షులుగా మోదీ, ట్రంప్‌

Update: 2020-06-12 07:14 GMT

ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనావైరస్ వ్యాప్తికి చైనా దేశం కేంద్రంగా ఉందన్న విషయం అందరికి తెలిసిందే. అయితే వైరస్ వ్యాప్తికి చైనాయే కారణమంటూ ఆ దేశాధ్యక్షుడు జి జిన్‌పింగ్‌పై కేసు నమోదైంది. బిహార్‌లోని పశ్చిమ చంపారన్ జిల్లా కోర్టులో కేసు నమోదు చేశారు. పశ్చిమ చంపారన్ జిల్లాలోని బెట్టియాలోని చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో న్యాయవాది మురాద్ అలీ దాఖలు చేసిన ఫిర్యాదులో చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్, ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ లు చైనాలోని వుహాన్ నగరం నుంచి ప్రపంచానికి వైరస్ వ్యాపించారని ఆరోపించారు.

వారు ప్రపంచానికి సరైన సమాచారం ఇవ్వలేదని అందువల్లే ప్రపంచం మొత్తం గడగడలాడిపోతుందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఐపిసిలోని 269, 270, 271, 302, 307, 500, 504, 120 బి సెక్షన్ల కింద చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఇందులో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ప్రధాని నరేంద్ర మోడీలను కూడా సాక్షులుగా ఫిర్యాదుదారు పేర్కొన్నారు. కరోనావైరస్ ను ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చేయడానికి చైనా అధ్యక్షుడు మరియు డబ్ల్యూహెచ్‌ఓ చీఫ్ కుట్ర పన్నారని, దీనివల్ల లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారని ఆయన ఆరోపించారు. ఇక ఈ కేసు విచారణ జూన్ 16ను జరగనుంది.  

Tags:    

Similar News