Digvijaya Singh about Sachin Pilot: పైలట్ ఓపిగ్గా ఉండాల్సింది: దిగ్విజయ్ సింగ్

Digvijaya Singh about Sachin Pilot: రాజకీయాల్లో యువతకి ఓపిక ఉడడం లేదని అన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్..

Update: 2020-07-15 12:45 GMT
Digvijaya Singh (file photo)

Digvijaya Singh about Sachin Pilot: రాజకీయాల్లో యువతకి ఓపిక ఉడడం లేదని అన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్.. తాజాగా రాజస్తాన్ లోని సచిన్ పైలట్ ని ఉద్దేశిస్తూ అయన ఈ వాఖ్యలు చేశారు. సచిన్ పైలట్ కు తక్కువ సమయంలోనే కాంగ్రెస్ ఎన్నో అవకాశాలు ఇచ్చిందని అన్నారు, కానీ అతను పార్టీకి వ్యతిరేకంగా పనిచేశారని అన్నారు. 26,27 ఏళ్లకే సచిన్ పైలట్ ని MP చేశామని, రాజస్థాన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష భాధ్యతలు ఇచ్చామని, ఉపముఖ్యమంత్రిగా కూడా అవకాశం ఇచ్చామని అన్నారు. ఇక బీజేపీ ఎంపీ జ్యోతిరాదిత్య సింధియా లాగే సచిన్ పైలట్ కూడా ఆవేశపడ్డాడని, సచిన్ ఇంకా యువకుడేనని అయనకున్న బాధ్యతలు, పదవుల దృష్ట్యా ఓపిగ్గా ఉండాల్సిందని దిగ్విజయ్ సింగ్ అభిప్రాయపడ్డాడు.

నేను బీజేపీలో చేరట్లేదు.. సచిన్‌ పైలట్‌ స్పష్టం!

సచిన్ పైలట్ కి కాంగ్రెస్ పార్టీ ఉద్వాసన పలకడంతో ఆయన బీజేపీలో చేరతారా లేకా కొత్త పార్టీ ఏమైనా పెడతారా అన్న దానిపై మీడియాలో రకరకాల వార్తలు వస్తున్న నేపథ్యంలో సచిన్‌ పైలట్‌ దీనిపైన స్పందించారు.. గ‌త అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బీజేపీపై పోరాడి గెలిచామ‌ని, కాంగ్రెస్ పార్టీ మళ్లీ అధికారంలోకి రావడానికి తాను ఎంతో కృషి చేశానని, ఇప్పుడు తానెందుకు బీజేపీలో చేరాల‌ని పైల‌ట్ ప్ర‌శ్నించారు. తాను బీజేపీలో చేరట్లేదని , కొందరు పనిగట్టుకుని ప్రచారం చేస్తున్నారని, అలా వస్తున్న వార్తలు కూడా అవాస్తవమని ఆయన మరోసారి స్పష్టం చేశారు.. అయితే భవిష్యత్‌ కార్యాచరణపై నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని సచిన్‌ పైలట్ వెల్లడించారు... అయితే, సచిన్‌ తన నిర్ణయాన్ని త్వరలోనే ప్రకటించే అవకాశం ఉన్నట్లుగా సమాచారం.

Tags:    

Similar News