Ghulam Nabi Azad: కాంగ్రెస్‌కు మరో షాక్‌.. ఆజాద్‌ రాజీనామా..!

Ghulam Nabi Azad: గతంలో రాజ్యసభ విపక్షనేతగా, కేంద్రమంత్రిగా పని చేశారు.

Update: 2022-08-26 06:31 GMT

Ghulam Nabi Azad: కాంగ్రెస్‌కు మరో షాక్‌.. ఆజాద్‌ రాజీనామా..!

Ghulam Nabi Azad: కాంగ్రెస్ పార్టీలో మార్పు అవసరమని గులాం నబీ ఆజాద్ పార్టీలో ఉంటూనే తన గళాన్ని గట్టిగా వినిపించారు. కేంద్రమంత్రిగానూ పనిచేసిన ఆయనకు మంచి ట్రబుల్ షూటర్ గా పేరుంది. దీంతో జమ్మూ కశ్మీర్ లో త్వరలో ఎన్నికలు జరిగే అవకాశం ఉండటంతో పార్టీని బలోపేతం చేసేందుకు కాంగ్రెస్ ఓ ప్రయత్నాన్ని ప్రారంభించింది. కమిటీ ప్రకటించిన గంటల వ్యవధిలోనే కాంగ్రెస్ కు గులాంనబీ ఆజాద్ షాకిస్తూ.. తాను కొత్త బాధ్యతలను స్వీకరించనని ఇటీవల తెలిపారు. తనకు బాధ్యతలు ఇచ్చినందుకు కాంగ్రెస్ అధిష్టానానికి కృతజ్ఞతలు చెప్పిన గులాం నబీ ఆజాద్.. అనారోగ్య సమస్యలతో తాను రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు.

అఖిల బారత కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీలో ఉన్న తనని.. జమ్ము కశ్మీర్ ప్రచార కమిటీ ఛైర్మన్ గా నియమించి తన హోదా తగ్గించారనే భావనలో గులాం నబీ ఆజాద్ ఉన్నారన్న ప్రచారం జరుగుతోంది. కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉంటూ వస్తున్న ఆయన.. పార్టీలో సంస్థాగత మార్పులు కావాలని కోరుతూ కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి లేఖ రాసిన 23 మంది నేతల్లో గులాం నబీ ఆజాద్ ఒకరు.

కాంగ్రెస్ పార్టీకి సీనియర్లు షాక్‌ల మీద షాక్‌లు ఇస్తున్నారు. మరీ ముఖ్యంగా ఎన్నికలు సమీపిస్తున్న చోట ఈ ఝలక్‌లు ఎదురవడం కాంగ్రెస్‌కు మింగుడుపడటం లేదు. అఖిల భారత కాంగ్రెస్ కమిటీలో అధ్యక్ష పదవికి ఎన్నికలను నిర్వహించడానికి ఏర్పాట్లు కొనసాగుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో.. ఆ పార్టీ కేటాయించిన పదవులను వదులుకుంటోన్న నాయకుల సంఖ్య పెరుగుతోంది. ఆజాద్ జీ 23 గ్రూపులో ఉన్నారు. పార్టీ నాయకత్వ నిర్ణయాలపై ఈ గ్రూపు అసహనంగా ఉన్నది.

కొన్నేళ్లుగా కాంగ్రెస్‌ నాయకత్వంపై అసంతృప్తి గళం వినిపిస్తున్న సీనియర్‌ నేతల జీ23 గ్రూప్‌లో ఆజాద్‌ ప్రముఖుడు. ఇటీవలే రాజ్యసభ పదవీకాలం ముగియగా పొడిగింపు దక్కలేదు. దీంతో ఆయన అసంతృప్తితో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది.

Tags:    

Similar News