Breaking News: కాంగ్రెస్ పార్టీ సంచలన నిర్ణయం.. తప్పుకోనున్న సోనియా..
కాంగ్రెస్ పార్టీ సంచలన నిర్ణయం
Breaking News: కాంగ్రెస్ పార్టీ సంచలన నిర్ణయం.. తప్పుకోనున్న సోనియా..
Nav Sankalp Chintan Shivir: ఉదయ్‌పూర్ కాంగ్రెస్ నవ సంకల్ప్ చింతన్ శిబిర్‌లో సోనియా గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఒక కుటుంబంలో ఒకరికే టికెట్ ఉంటుందన్నారు సోనియా. దీంతో ఆమె ప్రత్యక్ష రాజకీయాల నుండి తప్పుకోనున్నట్లు తెలుస్తుంది. అంతేకాదు కుటుంబంలో ఒకరికే టికెట్ అన్న సోనియా మాటలతో మరి ఎన్నికల్లో రాహుల్, ప్రియాంక ఇరువురిలో ఒకరే పోటీ చేస్తారా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి.
పార్టీలో ఒకే టికెట్ విధానమంటే టీ.పీసీసీ మాజీ చీఫ్ ఉత్తమ్ పరిస్థితి ఏంటి..? ప్రస్తుతం కోమటిరెడ్డి బ్రదర్స్ ఎలా స్పందించబోతున్నారనే టాక్ వినిపిస్తోంది. అయితే మరో అడుగు ముందుకు వేసిన సోనియా ఇకపై కాంగ్రెస్ నేతలు స్వార్థం వీడాలంటూ చేసిన వ్యాఖ్యలు దేనికి సంకేతం అనే విషయం హస్తం పార్టీలో చర్చనీయాంశంగా మారింది.