CM Jagan: ప్రధాని మోదీతో సీఎం జగన్ భేటీ
CM Jagan: దాదాపు 45 నిమిషాల పాటు ఇరువురి మధ్య చర్చ
CM Jagan: ప్రధాని మోదీతో సీఎం జగన్ భేటీ
CM Jagan: ప్రధాని మోడీతో సీఎం జగన్ భేటీ అయ్యారు. దాదాపు 45 నిమిషాల పాటు ఇరువురి మధ్య పలు అంశాలపై చర్చ జరిగింది. పోలవరంతో పాటు రాష్ట్రానికి రావాల్సిన వాటా, పెండింగ్ నిధులపై మోడీతో సీఎం జగన్ చర్చించినట్టు సమాచారం. మోడీతో భేటీ అనంతరం.. కేంద్రమంత్రి భూపేంద్ర నివాసానికి చేరుకున్న సీఎం జగన్.. ఆయనతో భేటీ అయ్యారు. ఇదిలా ఉంటే.. రాత్రి 10 గంటలకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో సమావేశం కానున్నారు సీఎం జగన్... ఈ భేటీలో కీలక విషయాలు చర్చించనున్నారు.