Modi - Chinna Jeeyar: ప్రధాని మోడీని కలిసిన చినజీయర్ స్వామి

* శ్రీ రామానుజాచార్య సహస్రాబ్దీ సమారోహానికి ఆహ్వానం * రామానుజస్వామి విగ్రహావిష్కరణకు రావాలని ఆహ్వానం

Update: 2021-09-18 12:45 GMT

ప్రధాని మోడీని కలిసిన చిన జీయర్ స్వామి(ట్విట్టర్ ఫోటో)

Narendra Modi - Chinna Jeeyar Swamy: హైదరాబాద్ ముచ్చింతల్ లో జరుపుతున్న భగవత్ రామానుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాలకు దేశ వ్యాప్తంగా ప్రముఖులను ఆహ్వానిస్తున్నారు ముచ్చింతల్ లో ఏర్పాటు చేస్తున్న 216 అడుగుల రామానుజాచార్య పంచలోహ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి తప్పనిసరిగా రావాల్సిందిగా చినజీయర్ స్వామి ప్రధాని మోదీని ఆహ్వానించారు. అంతేకాదు సహస్రాబ్ది మహోత్సవాల విశిష్టతను మోదీకి వివరించారు స్వామీజీ. చిన్నజీయర్‌ స్వామీజీతో పాటు మైహోం గ్రూప్‌ అధినేత డాక్టర్‌ జూపల్లి రామేశ్వరరావు కూడా మోదీని కలిసి ప్రాజెక్టు విశేషాలను తెలియజేశారు ప్రపంచ శాంతి కోసం చిన్న జీయర్ స్వామి చేస్తున్న ప్రయత్నాన్ని అభినందించిన మోదీ విగ్రహ ఆవిష్కరణకు తప్పక వస్తానని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.

కుల వర్గ బంధనాలను తెంచి దేవుడికి అందరూ సమానమే నని భక్తులను భగవంతుడిని అనుసంధానం చేసిన ఆధ్యాత్మిక విప్లవమూర్తి భగవత్‌ శ్రీ రామానుజాచార్య. సమాజమంతటినీ ఏకం చేసిన ఆ సమతా మూర్తి విగ్రహం కొలువుదీరుతుండడంతో శంషాబాద్‌ ముచ్చింతల్‌ ప్రాంతం ఓ ఆధ్యాత్మిక కేంద్రంగా కొత్త రూపును సంతరించుకోనుంది. 216 అడుగుల ఎత్తుతో పంచలోహాలతో తీర్చిదిద్దిన శ్రీరామానుజాచార్య విగ్రహావిష్కరణ మహోత్సవానికి రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ప్రధాని కేంద్రమంత్రులు భారత ప్రధాన న్యాయమూర్తి ఇలా మహామహులంతా తరలి రానున్నారు

ఫిబ్రవరి 2 నుంచి 14 వరకూ రామానుజ ప్రాజెక్ట్‌ ఆవిష్కరణ మహోత్సవంతో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరియనుంది. విశ్వనగరంగా ఇప్పటికే పేరు పొందిన హైదరాబాద్‌కు ప్రపంచ ఆధ్యాత్మిక రాజధానిగా గుర్తింపు తేనుంది. సమాజాన్ని విచ్ఛిన్నం చేసే శక్తులను నిర్వీర్యం చేసి ప్రజలందరి మధ్య సత్సంబంధాలు వెల్లివిరిసేలా చేయడానికి శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామీజీ చేపట్టిన ఈ రామానుజ మహాయజ్ఞం అందరి కళ్ల ముందు సాక్షాత్కరించనుంది.

గడిచిన ఐదు రోజులుగా ఢిల్లీలో పర్యటించిన చిన్న జీయర్ స్వామి రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, రక్షణ మంత్రిలతోపాటు ఎందరో కేంద్ర మంత్రులకు ఆహ్వానాలు ఇస్తున్నారు. రామానుజాచార్య విగ్రహ విశేషాలను ఏర్పాటు చేయడానికి గల కారణాలను రాష్ట్రపతికి వివరించారు చిన్నజీయర్‌ స్వామీజీ. సమాజంలో అంటరానితనాన్ని, వివక్షను రూపుమాపి సమానత్వ సాధన కోసం కృషిచేసిన భగవత్‌ రామానుజాచార్యులు సామాజిక సంస్కరణాభిలాషిగా చెరగని ముద్ర వేశారన్నారు

Tags:    

Similar News