Bomb Threat on Mumbai Taj Hotel: తాజ్‌హోటల్‌కు బాంబు బెదిరింపు... కరాచీ నుంచి కాల్!

Bomb Threat on Mumbai Taj Hotel: ముంబైలోని ప్రముఖ హోటల్ తాజ్ కి బెదిరింపు కాల్ వచ్చింది. పాకిస్తాన్ లోని కరాచీ నుంచి ఆ కాల్ వచ్చినట్టుగా పోలీసులు గుర్తించారు

Update: 2020-06-30 10:38 GMT

Bomb Threat on Mumbai Taj Hotel: ముంబైలోని ప్రముఖ హోటల్ తాజ్ కి బెదిరింపు కాల్ వచ్చింది. పాకిస్తాన్ లోని కరాచీ నుంచి ఆ కాల్ వచ్చినట్టుగా పోలీసులు గుర్తించారు.. ఎవరో ఓ ఆగంతకడు ఫోన్ చేసి బాంబులతో హోటల్ ని పేల్చేస్తామని చెప్పుకొచ్చాడు. దీనితో వెంటనే అప్రమత్తమైన ముంబై పోలీసులు హోటల్ పరిసర ప్రాంతాల్లో భారీర్ భద్రతను ఏర్పాటు చేశారు. ఆ ఫోన్ కాల్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు..

ఇక గతంలో పాకిస్థాన్ టెర్రరిస్టులు అదే తాజ్ హోటల్ పైన దాడి చేసిన విషయం తెలిసిందే.. 2008 నవంబర్ 26న ఈ ఘటన జరిగింది.. ఈ ఉగ్ర‌దాడిలో 166 మంది మంది చనిపోగా 300 మందికి పైగా గాయపడ్డారు.. దీనికి కారణం అయిన న‌లుగురు ఉగ్ర‌వాదుల‌ను భ‌ద్ర‌తా ద‌ళాలు హ‌త‌మార్చాయి. దాదాపు నాలుగు గంటల పాటు సాగిన ఈ ఎదురుకాల్పుల్లో నలుగురు భద్రతా సిబ్బంది, ఒక పోలీసు అధికారి, ఇద్దరు పౌరులు కూడా మృతి చెందారు.

ఒకపక్కా ముంబైలో కరోనా కేసులు పెరుగుతూ అందరిని భయాందోళనకు గురిచేస్తోంది. ఈ నేపధ్యంలో తాజ్ హోటల్ ని పేల్చేస్తాం అంటూ ఇలాంటి కాల్స్ రావడం ఆ రాష్ట్రాన్ని మరింతగా కంగారు పెడుతుంది. ముంబైలో కరోనా కేసులు విషయానికి వచ్చేసరికి నిన్నటివరకూ (సోమవారం) ఉన్న సమాచారం ప్రకారం అక్కడ ఒక్కరోజే 5,257 కరోనా పాజిటివ్ కేసులు నమోదయినట్లు ఆ రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ ప్రకటించింది. తాజా కేసులతో కలిపి ఆ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,69,883కు చేరింది. మరణాల సంఖ్య కూడా మహారాష్ట్రలో కల్లోలం రేపుతోంది.

ఇక అటు భారత్ లో కరోనా ఉగ్రరూపం దాలుస్తోంది. వివిధ రాష్ట్రాల నుండి కొత్త కేసులు పెరుగుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో భారత్‌లో 18,522 కేసులు నమోదు కాగా, 418 మంది ప్రాణాలు విడిచారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. తాజాగా కేసులతో కలిపి దేశంలో మొత్తం 5,66,840 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 2, 15,125 ఉండగా, 3,34,821 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఇదిలా ఉండగా 16,893 మంది కరోనా వ్యాధితో మరణించారు.


Tags:    

Similar News