Raipur: కరోనా మృతులతో కిక్కిరిసిపోతున్న మార్చురీ

Raipur: అనూహ్య రీతిలో ప్రాణనష్టం వాటిల్లుతుండడంతో భద్రపరిచే అవకాశం లేక శవాలను గోనెసంచుల్లో కూరి ఆరుబయటే వదిలేస్తున్నారు.

Update: 2021-04-13 03:48 GMT

Raipur:(File Image)

Raipur: ఇండియాలో కరోనా చాలా వేగంగా పెరుగుతోంది. 7 రోజుల్లో 9 లక్షల కేసులు వచ్చాయి. ఫలితంగా ప్రపంచంలో ఎక్కువ కరోనా కేసులున్న దేశాల్లో అమెరికా తర్వాత భారత్ సెకండ్ నిలిచింది. మొన్నటిదాకా సెకండ్ ఉన్న బ్రెజిల్... మూడో స్థానానికి వెళ్లింది. తాజాగా ఛత్తీస్ గఢ్ లోని రాయపుర్లో ఎటు చూసినా మృతదేహాలే. నలువైపులా శవాల గుట్టలే. సామర్థ్యానికి మించిన స్థాయిలో మృతదేహాలు వెల్లువెత్తుతుంటే ఆసుపత్రి వర్గాలు నిస్సహాయంగా చూడాల్సి వస్తోంది. ఇది ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పుర్‌లో అతిపెద్దదైన డాక్టర్‌ భీమ్‌రావు అంబేడ్కర్‌ స్మారక ప్రభుత్వ ఆసుపత్రిలో దయనీయ స్థితి. కరోనా కరాళ నృత్యానికి ఇక్కడి శవాగారం తార్కాణంగా కనిపిస్తోంది. అనూహ్య రీతిలో ప్రాణనష్టం వాటిల్లుతుండడంతో భద్రపరిచే అవకాశం లేక శవాలను గోనెసంచుల్లో కూరి ఆరుబయటే వదిలేస్తున్నారు. అంత్యక్రియలకు వెళ్తున్న మృతదేహాల కంటే ఎక్కువే ప్రతిరోజూ మార్చురీకి వస్తున్నాయని ఆసుపత్రి వర్గాలు చెబుతున్నాయి. సాధారణం కంటే పదిరెట్లు ఎక్కువ శవాలు వస్తుండడంతో పరిస్థితి అర్థం కావడం లేదని, ఒకేసారి అన్ని అదనపు ఫ్రీజర్లు ఎలా ఏర్పాటు చేయగలమని నిస్సహాయంగా ప్రశ్నిస్తున్నాయి. శ్మశాన వాటికలూ సరిపోవడం లేదని పేర్కొంటున్నాయి.

అతి పెద్ద సమస్యగా కరోనా...

ఇండియాలోనే కాదు ప్రపంచ దేశాలన్నింటికీ అతి పెద్ద సమస్యగా కరోనా మారింది. ముఖ్యంగా మన దేశంలో రోజూ లక్షన్నరకు పైగా కేసులు వస్తుంటే... సమస్యలు మరింత పెరుగుతున్నాయి. వ్యాక్సిన్ల కొరతను తీర్చేందుకు రష్యా వ్యాక్సిన్ స్పుత్నిక్ ని ఎమర్జెన్సీ వాడకానికి అనుమతించడంతో... త్వరలోనే ఈ మూడో వ్యాక్సిన్ కూడా దేశ ప్రజలకు అందుబాటులోకి వస్తుంది. దీన్ని ఇండియాలో డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ తయారుచేస్తోంది. అటు కేంద్రం కూడా మరిన్ని వ్యాక్సిన్ డోసులను రాష్ట్రాలకు పంపుతోంది. ఐతే... ఆస్పత్రుల్లో ఐసీయూ బెడ్ల కొరత పెరుగుతోంది. వ్యాక్సిన్ వేసుకున్న వారికి కూడా కరోనా పాజిటివ్ రావడంతో అందరిలోనూ ఆందోళన మొదలైంది.

Tags:    

Similar News