Boat Capsized: బీహార్‌లో ఘోర విషాదం.. పాఠశాల విద్యార్థులతో వెళ్తున్న పడవ బోల్తా.. 12 మంది మిస్సింగ్‌

Boat Capsized: బీహార్ లో ఘోర ప్రమాదం జరిగింది. 30 మంది విద్యార్థులతో వెళ్తున్న పడవ ఒక్కసారిగా బోల్తాపడింది.

Update: 2023-09-14 07:52 GMT

Boat Capsized: బీహార్‌లో ఘోర విషాదం.. పాఠశాల విద్యార్థులతో వెళ్తున్న పడవ బోల్తా.. 12 మంది మిస్సింగ్‌

Boat Capsized: బీహార్ లో ఘోర ప్రమాదం జరిగింది. 30 మంది విద్యార్థులతో వెళ్తున్న పడవ ఒక్కసారిగా బోల్తాపడింది. ఈ ఘటన గురువారం రోజున ముజఫర్ పూర్ జిల్లాలో జరిగింది. బాగ్‌మతి నదిలో పడవ ప్రయాణిస్తున్న సమయంలో ఈ దుర్ఘటన జరిగింది. పడవ బోల్తా సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఇప్పటి వరకూ 22 మందిని సురక్షితంగా రక్షించారు. వారిని చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో 12 మంది చిన్నారులు గల్లంతయ్యారు. వారి కోసం గాలింపు చేపడుతున్నారు.

Tags:    

Similar News