Madhya Pradesh: మధ్యప్రదేశ్ సీఎం ఎంపికపై భోపాల్‌లో బీజేపీ కీలక భేటీ
Madhya Pradesh: సీఎం రేసులో శివరాజ్‌సింగ్ చౌహాన్, నరేంద్రసింగ్ తోమర్..ప్రహ్లాద్ పటేల్, జ్యోతిరాదిత్య సింధియా, వి.డి.శర్మ, కైలాష్ విజయ్
Madhya Pradesh: మధ్యప్రదేశ్ సీఎం ఎంపికపై భోపాల్‌లో బీజేపీ కీలక భేటీ
Madhya Pradesh: మధ్యప్రదేశ్ సీఎం ఎవరన్న అంశంపై ఉత్కంఠ నెలకొంది. ముఖ్యమంత్రిగా ఎవరిని నియమించాలని.. ముగ్గురు ప్రముఖ నాయకులను పరిశీలకులుగా బీజేపీ అధిష్టానం మధ్యప్రదేశ్‌కు పంపింది. కాగా.. కోర్ గ్రూప్, శాసనసభా పక్షం సమావేశం అనంతరం పరిశీలకులు ఎమ్మెల్యేలతో మాట్లాడి రాష్ట్ర తదుపరి సీఎం పేరుపై ఏకాభిప్రాయం ప్రకటించనున్నారు.
కాగా.. సీఎం పదవి కోసం.. మొత్తంగా ఆరుగురు పోటీ పడుతుండగా.. ప్రధానంగా ఇటు ప్రహ్లాద్ పటేల్.. అటు శివరాజ్ సింగ్ చౌహాన్ మధ్యనే పోటీ ఎక్కువ ఉన్నట్టు తెలుస్తుంది. దీంతో ఇరు వర్గాల మద్దతుదారులు నినాదాలు అందుకున్నారు. ఇప్పటికే గత ప్రభుత్వంలో శివరాజ్ సింగ్ చౌహాన్ ముఖ్యమంత్రిగా పని చేశారు. అయితే.. సీఎం పోస్ట్‌కు పోటీ ఉండటంతో.. ముందు డిప్యూటీ సీఎంను నియమించాలని పరిశీలకులు భావించారు. ఇద్దరు డిప్యూటీ సీఎంలను ప్రకటించి... అనంతరం సీఎం అభ్యర్థిని ప్రకటించనున్నట్టు తెలుస్తుంది.