Electoral Bonds: బీజేపీకి 87 శాతం పెరిగిన విరాళాలు.. పడిపోయిన ఎలక్టోరల్ బాండ్ల ఆదాయం
Electoral Bonds: భారతీయ జనతా పార్టీ బీజేపీకి 2023-24 ఆర్ధిక సంవత్సరంలో రూ.1,685 కోట్ల విరాళాలు ఎలక్టోరల్ బాండ్ల ద్వారా వచ్చాయి.
Electoral Bonds: బీజేపీకి 87 శాతం పెరిగిన విరాళాలు.. పడిపోయిన ఎలక్టోరల్ బాండ్ల ఆదాయం
Electoral Bonds: భారతీయ జనతా పార్టీ బీజేపీకి 2023-24 ఆర్ధిక సంవత్సరంలో రూ.1,685 కోట్ల విరాళాలు ఎలక్టోరల్ బాండ్ల ద్వారా వచ్చాయి. దేశంలో ఏ పార్టీకి ఇంత పెద్ద మొత్తంలో విరాళాలు రాలేదు. అంతకుముందు ఏడాదితో పోలిస్తే ఆ పార్టీకి విరాళాలు 87 శాతం పెరిగాయి.మరో వైపు ఎలక్టోరల్ బాండ్ల ద్వారా వచ్చే విరాళాలు సగానికి సగం తగ్గాయి.
2023-24 మార్చి 31 నాటికి విరాళాలతో పాటు ఆ పార్టీ ఆదాయం కలిపితే ఆ పార్టీ వద్ద రూ.4,340 కోట్లు ఉన్నాయి. కేంద్ర ఎన్నికల సంఘానికి బీజేపీ ఇచ్చిన వార్షిక ఆడిట్ రిపోర్టులో ఈ వివరాలు తెలిపింది.
2022-2023లో రూ. 2,120.06 కోట్లు విరాళాలు ఆ పార్టీకి అందాయి. 2023-24 ఆర్ధిక సంవత్సరంలో రూ.1,685 కోట్ల విరాళాలు ఎలక్టోరల్ బాండ్ల ద్వారా వచ్చాయి. బీజేపీకి అందిన విరాళాల్లో 43 శాతం ఎలక్టోరల్ బాండ్ల ద్వారా వచ్చినవే. గత ఏడాది ఫిబ్రవరిలో సుప్రీంకోర్టు ఎలక్టోరల్ బాండ్లను సుప్రీంకోర్టు రద్దు చేసింది.ఇలా విరాళాలు ఇవ్వడం రాజ్యంగ విరుద్దమని ఉన్నత న్యాయస్థానం అప్పట్లో వ్యాఖ్యానించింది.
2024లో లోక్ సభ ఎన్నికలు జరిగాయి. ఏప్రిల్ 19 నుంచి జూన్ 1 వరకు ఏడు దశల్లో లోక్ సభ ఎన్నికలు జరిగాయి.ఈ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్ డీ ఏ అధికారంలోకి వచ్చింది. ఈ ఎన్నికల ఖర్చు కోసం బీజేపీ రూ.1,754.06 కోట్లు ఖర్చు చేసింది. అంతకు ముందు ఆ పార్టీ రూ.1,092.15 కోట్లు ఖర్చు చేసింది. రూ.591.39 కోట్లు అడ్వర్ టైజ్ మెంట్స్, ప్రచారం కోసం ఖర్చు చేశారు.
కాంగ్రెస్ పార్టీకి విరాళాలు 2023-24 ఆర్ధిక సంవత్సరంలో పెరిగాయి. ఈ విరాళాలు 320 శాతం పెరిగినట్టుగా ఆ పార్టీ ఈసీకి ఇచ్చిన నివేదిక తెలుపుతోంది.అంతకుముందు ఏడాది ఆ పార్టీకి రూ. 268. 62 కోట్ల విరాళాలు వచ్చాయి. కానీ, 2023-24 నాటికి ఆ పార్టీకి రూ.1,129 కోట్లకు ఆ పార్టీ విరాళాలు పెరిగాయి.కాంగ్రెస్ పార్టీకి ఎలక్టోరల్ బాండ్ల ద్వారా రూ828.36 కోట్లు వచ్చాయి. కాంగ్రెస్ పార్టీ 2024లో లోక్ సభ ఎన్నికల కోసం 619. కోట్లు ఖర్చు చేసింది.
ఇక తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఆదాయం కూడా పెరిగింది. ఆ పార్టీకి 646.39 కోట్ల విరాళాలు వచ్చాయి. అంతకుముందు ఏడాది ఆ పార్టీకి 333.46 కోట్లు విరాళాలు అందాయి. ఎలక్టోరల్ బాండ్ల ద్వారానే ఆ పార్టీకి 95 శాతం ఆదాయం వచ్చింది.