Subramanian Swamy: ప్రధాని కార్యాలయంలో సైకోలున్నారు.. బీజేపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు
Subramanian Swamy: ప్రధాని కార్యాలయంలో సైకోలున్నారంటూ బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
Subramanian Swamy: ప్రధాని కార్యాలయంలో సైకోలున్నారు.. బీజేపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు
Subramanian Swamy: ప్రధాని కార్యాలయంలో సైకోలున్నారంటూ బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఏకంగా సొంత ప్రభుత్వంలో ప్రధాని కార్యాలయాన్నే టార్గెట్ చేస్తూ చేసిన కామెంట్స్ తీవ్ర సంచలనం రేపాయి. దేశంలో కోవిడ్ థర్డ్ వేవ్‌పై అనేక హెచ్చరికలు వస్తున్నాయి. ఈ నేపధ్యంలో కేంద్ర మంత్రి గడ్కరీ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయాలని రెండు రోజుల క్రితం సుబ్రమణ్యస్వామి సూచించారు. బుధవారం ఇదే విషయాన్ని తిరిగి ప్రస్తావిస్తూ చేసిన ట్విట్టర్ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఈరోజు ప్రధాని సలహాదారు కూడా కోవిడ్ థర్డ్ వేవ్‌ను నిర్ధారించారు. కోవిడ్‌ను అరికట్టడానికి సరైన వ్యూహరచన చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి పీఎంవో సైకోలు కాకుండా ప్రత్యేకమైన టీం కావాలని సుబ్రమణ్యస్వామి ట్వీట్ చేశారు.