Narendra Modi: రాజస్థాన్ కోట్‌పుత్లీలో బీజేపీ ఎన్నికల ప్రచార సభ
Narendra Modi: ఒకవైపు నేషన్ ఫస్ట్ అనే బీజేపీ.. మరోవైపు దేశాన్ని దోచుకునే కాంగ్రెస్
Narendra Modi: రాజస్థాన్ కోట్‌పుత్లీలో బీజేపీ ఎన్నికల ప్రచార సభ
Narendra Modi: రాజస్థాన్‌లో జరిగిన బీజేపీ ఎన్నికల ప్రచార సభలో ప్రధాని మోడీ.. కాంగ్రెస్‌తోపాటు విపక్షాలపై నిప్పులు చెరిగారు. ఈ ఎన్నికల్లో దేశ రాజకీయాలు రెండు వర్గాలుగా విడిపోయినట్లు కనిపిస్తోందని మోడీ అన్నారు. ఒకవైపు నేషన్ ఫస్ట్ అనే బీజేపీ, మరోవైపు దేశాన్ని దోచుకోవడానికి అవకాశాల కోసం చూస్తున్న కాంగ్రెస్ పార్టీ ఉందని హాట్ కామెంట్స్ చేశారు. ఒకవైపు దేశం మొత్తం తన పరివార్ అని నమ్మే మోడీ అని, మరోవైపు దేశం కంటే తమ కుటుంబమే ముఖ్యమని నమ్మే కాంగ్రెస్ ఉందని ప్రధాని అన్నారు. 10 ఏళ్లలో మనం ఏం చేశామో అది కేవలం ట్రైలర్ మాత్రమే, ఇంకా చేయాల్సింది చాలా ఉందన్నారు మోడీ.