BJP: నేడు బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం

BJP: లోక్‌సభ అభ్యర్థులను ఖరారు చేయనున్న అధిష్టానం

Update: 2024-02-29 02:11 GMT

BJP: నేడు బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం

BJP: ఢిల్లీలో ఇవాళ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం జరగనుంది. లోక్‌సభ ఎన్నికలకు అభ్యర్థులను ఖరారు చేయనుంది బీజేపీ హైకమాండ్. కాగా ఈ సమావేశానికి తెలంగాణ బీజేపీ నేతలు హాజరుకానున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, బండి సంజయ్, డీకే అరుణ ఈ భేటీకి హాజరుకానున్నారు. తెలంగాణలో మెజార్టీ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయనుంది బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ. ఇక తెలంగాణ నుంచి 10 మంది అభ్యర్థులను బీజేపీ అధిష్టానం ప్రకటించే అవకాశం ఉంది. ఇప్పటికే లోక్‌సభ టికెట్ల కోసం ఆశావహులు ఢిల్లీకి క్యూ కట్టారు. మరోవైపు బీఆర్ఎస్‌కు రాజీనామా చేసిన ఎంపీ రాములు ఇవాళ బీజేపీలో చేరనున్నారు.

Tags:    

Similar News