Madhya Pradesh CM: మధ్యప్రదేశ్ కొత్త సీఎంగా మోహన్ యాదవ్ నియామకం
Madhya Pradesh CM: మధ్యప్రదేశ్ కొత్త సీఎంగా మోహన్ యాదవ్‌ను నియమిస్తూ.. అధిష్టానం నిర్ణయం తీసుకుంది.
Madhya Pradesh CM: మధ్యప్రదేశ్ కొత్త సీఎంగా మోహన్ యాదవ్ నియామకం
Madhya Pradesh CM: మధ్యప్రదేశ్ కొత్త సీఎంగా మోహన్ యాదవ్‌ను నియమిస్తూ.. అధిష్టానం నిర్ణయం తీసుకుంది. మోహన్ యాదవ్ ప్రస్తుతం ఉజ్జయినీ సౌత్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. గతంలో శివరాజ్ సింగ్ చౌహన్ కేబినెట్‌లో పనిచేసిన అనుభవం ఉండటంతో.. మోహన్ యాదవ్‌ను కొత్త సీఎంగా ఖరారు చేసింది.
కాగా.. సీఎం పదవి కోసం.. మొత్తంగా ఆరుగురు పోటీ పడుతుండగా అనుహ్యంగా మోహన్ యాదవ్‌ను తెరపైకి తీసుకొచ్చి బీజేపీ అధిష్టానం సంచలన నిర్ణయం తీసుకుంది. 2013లో తొలిసారిగా అసెంబ్లీకి ఎన్నికైన మోహన్ యాదవ్.. రాజకీయాల్లోకి వచ్చిన దశాబ్ద కాలంలోనే సీఎంగా బాధ్యతలు చేపట్టనున్నారు.