Bihar Caste Census: 40 మంది మహిళలకు ఒక్కడే భర్త.. కానీ ఒక్కరికీ తాళి కట్టలేదు.. రెడ్ లైట్ ఏరియాలో నోరెళ్లబెట్టిన అధికారులు..

Bihar Caste Census: దాదాపు 40 మంది మహిళలు ఒకే పేరును తమ భర్త పేరుగా ప్రభుత్వ రికార్డుల్లో నమోదు చేసుకున్నారు.

Update: 2023-04-26 06:22 GMT

Bihar Caste Census: 40 మంది మహిళలకు ఒక్కడే భర్త.. కానీ ఒక్కరికీ తాళి కట్టలేదు..రెడ్ లైట్ ఏరియాలో నోరెళ్లబెట్టిన అధికారులు..

Bihar Caste Census: దాదాపు 40 మంది మహిళలు ఒకే పేరును తమ భర్త పేరుగా ప్రభుత్వ రికార్డుల్లో నమోదు చేసుకున్నారు. దీంతో అధికారులు షాక్ తిన్నారు. బిహార్ లో ప్రస్తుతం రెండో దశ కులగణన జరుగుతోంది. ఇందులో భాగంగా అధికారులు ప్రతి ఇంటికి తిరుగుతూ వారి కులం, విద్య, ఆర్థిక స్థితి ఇటువంటి విషయాలను నమోదు చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే అర్వల్ జిల్లాలోని ఓ రెడ్ లైట్ ఏరియాకు వెళ్లారు. వివరాలు సేకరించేందుకు వెళ్లిన ఆ ప్రభుత్వ ఉద్యోగులకు మైండ్ బ్లాక్ అయింది. ఏ మహిళను కదిలించినా తన భర్త పేరు రూప్ చంద్ అని చెబుతోంది. ఇలా ఇద్దరు ముగ్గురు కాదు ఏకంగా 40 మంది మహిళలు తమ భర్త పేరు రూప్ చంద్ అని చెప్పారు. చాలా మంది పిల్లలు సైతం తమ తండ్రి పేరు చెప్పమంటే రూప్ చంద్ అనే అన్నారు. దీంతో ఎవరీ రూప్ చంద్..అని ఆరా తీయగా అసలు విషయం వెలుగుచూసింది.

వివరాలు సేకరిస్తున్న ఆ రెడ్ లైట్ ఏరియాలో రూప్ చంద్ అనే ఒక డ్యాన్సర్ ఉన్నాడు. అతడు అక్కడే చాలా ఏళ్లుగా నివాసం ఉంటున్నాడు. అక్కడే పాటలు పాడుతూ, డాన్స్ చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అతనంటే అక్కడ ఉంటున్న మహిళలకు ప్రత్యేక అభిమానం. దీంతో రూప్ చంద్ కు అక్కడ సొంత నివాసం లేకపోయినా..అతడినే తమ భర్తగా పలువురు మహిళలు చెప్పుకోవడం పరిపాటిగా మారింది. నీ భర్త పేరేంటి అని ఏ మహిళను అడిగినా తడుముకోకుండా రూప్ చంద్ అని చెప్పడం అక్కడి మహిళలకు అలవాటుగా మారింది. అంతేకాదు, అక్కడ నివాసం ఉంటున్న పిల్లలు సైతం మీ తండ్రి పేరేంటి అని అడిగితే రూప్ చంద్ అని ఠక్కున సమాధానం చెబుతుంటారు.

మహిళలు, పిల్లలతో రూప్ చంద్ కు ప్రత్యేకించి ఎలాంటి సంబంధం లేకపోయినా..అతడి పేరును మాత్రం ఆ రెడ్ లైట్ మహిళలు తమకు అనుకూలంగా వాడేసుకుంటున్నారు. ఇక తన భర్త పేరు రూప్ చంద్ అని చెప్పిన ఏ మహిళకు అతడు తాళి కట్టింది లేదు..అతడు ఒంటరిగానే జీవిస్తున్నాడు. ఇకపోతే, ఈ ప్రాంతంలో ఉండేవారికి కులం అంటూ ఏదీ లేదని అధికారులు తేల్చారు.

Tags:    

Similar News