Boat Capsizes: రక్షాబంధన్‌కు వెళ్తుండగా పడవ బోల్తా.. 20 మంది మృతి!
Boat Capsizes: ఉత్తరప్రదేశ్‌లో ఘోర ప్రమాదం జరిగింది.
Boat Capsizes: రక్షాబంధన్‌కు వెళ్తుండగా పడవ బోల్తా.. 20 మంది మృతి!
Boat Capsizes: ఉత్తరప్రదేశ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. బాందా జిల్లాలోని యమునా నదిలో ఓ పడవ మునిగిపోయింది. ఈ దుర్ఘటనలో 20 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రమాద సమయంలో బోటులో 50 మందికి పైగా ఉన్నట్లు సమాచారం. మార్కా గ్రామంలోని మార్కా ఘాట్ నుంచి ఫతేపూర్‌కు పడవలో వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు.
నదీ ప్రవాహం ఎక్కువగా ఉండటం వల్లే ప్రమాదానికి గురైనట్లు అనుమానిస్తున్నారు. మరోవైపు పడవలోని మహిళా ప్రయాణికులు రక్షాబంధన్ కోసం వెళ్తున్నట్లుగా స్థానికులు పేర్కొన్నారు. సమాచారం అందుకున్న అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. పలువురి ఆచూకీ గల్లంతైనట్లు చెప్పారు.