Arvind Kejriwal: ఢిల్లీ మద్యం కేసులో.. కేజ్రీవాల్‌కు బెయిల్
Arvind Kejriwal: మద్యం పాలసీ కేసుల్లో సమన్లు పాటించకపోవడంపై ఈడీ ఫిర్యాదులపై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది కోర్టు.
Arvind Kejriwal: ఢిల్లీ మద్యం కేసులో.. కేజ్రీవాల్‌కు బెయిల్
Arvind Kejriwal: మద్యం పాలసీ కేసుల్లో సమన్లు పాటించకపోవడంపై ఈడీ ఫిర్యాదులపై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది కోర్టు. రౌస్ అవెన్యూ కోర్టుకు విచారన సంస్థ జారీ చేసిన సమన్లు పాటించలేదంటూ ఈడీ ఫిర్యాదులపై కేజ్రీవాల్ కోర్టుకు హాజరయ్యారు. రూ.లక్ష పూచీకత్తు, రూ.15వేల బాండ్ తో బెయిల్ మంజూరు చేసింది. సమన్లు రద్దు చేయాలని కేజ్రీవాల్ సీబీఐ ప్రత్యేక కోర్టును కోరారు. కేజ్రీవాల్ పిటిషన్ ను నిన్న సీబీఐ ప్రత్యేక కోర్టు తోసి పుచ్చింది. లిక్కర్ కేసులో కేజ్రీవాల్ కు 8 సార్లు నోటీసులు జారీ చేసింది ఈడీ. తదుపరి విచారణ ఏప్రిల్ ఒకటికి వాయిదా వేసింది రౌస్ అవెన్యూ కోర్టు.