ఉంఫాన్ తుఫాన్ బీభత్సానికి 86 మంది మృతి

ఒక పక్కా కరోనా కేసులతో దేశం వణుకుతున్న వేళా మరోపక్కా ఉంఫాన్ తుఫాన్ విరుచుకుపడింది.

Update: 2020-05-24 07:03 GMT

ఒక పక్కా కరోనా కేసులతో దేశం వణుకుతున్న వేళా మరోపక్కా ఉంఫాన్ తుఫాన్ విరుచుకుపడింది. ఈ తుఫాన్ తాకిడికి పశ్చిమబెంగాల్‌లో 86 మంది మరణించారు, వేలాది మంది నిరాశ్రయులయ్యారు. తుఫాను కారణంగా పశ్చిమ బెంగాల్ లో విద్యుత్, నీటి సరఫరా సమస్య తీవ్రం అయింది. కొన్నిచోట్ల విద్యుత్ పునరుద్ధరణ పనులు మొదలు కాలేదు. అవసరమైన సౌకర్యాలు లేకపోవడంతో ప్రజల సమస్యలు మరింత పెరుగుతున్నాయి. కొన్నిచోట్ల సహాయకచర్యలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం సైన్యం సహాయం కోరింది. సైన్యం కూడా దీనికి వెంటనే ఆమోదం తెలిపింది. బెంగాల్‌లో సహాయ, సహాయక చర్యల కోసం ఆర్మీ సిబ్బంది మోహరించనున్నారు. దాదాపు 350 మంది దాకా సహాయక చర్యల్లో పాల్గొననున్నట్టు తెలుస్తోంది. వీరంతా కోల్‌కతా, పరిసర జిల్లాల్లో మోహరించనున్నారు. తుఫాను బాధితుల కోసం ఎన్‌డిఆర్‌ఎఫ్‌, ఎస్‌డిఆర్‌ఎఫ్‌ బృందాలు కూడా మోహరించాయి.

మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం కూడా 24X7 సహాయక చర్యల్లో నిమగ్నమై ఉంది.. నిత్యావసర వస్తువులను సరఫరా చేస్తుంది. ఇప్పటికే పాలు, కూరగాయలు, పప్పులు, బియ్యం సరఫరా చేసింది. కాగా రైల్వేలు, ఓడరేవులు మరియు ప్రైవేటు రంగం నుండి కూడా సహాయం కోరింది ప్రభుత్వం. ఈ సందర్బంగా ప్రభుత్వం పెద్దలు మాట్లాడుతూ.. తమ ప్రాధాన్యత తాగునీటి వ్యవస్థ ,మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం అని అన్నారు.. ఇక కరెంటు స్థంబాలు పూర్తిగా విరిగిపడటంతో చాలా చోట్ల ముఖ్యమైన ప్రదేశాలలో జనరేటర్లను ఏర్పాటు చేస్తున్నారు. పడిపోయిన చెట్లను తొలగించడానికి 100 కి పైగా బృందాలను ఏర్పాటు చేసింది ప్రభుత్వం.

Tags:    

Similar News